పెళ్లి వద్దు.. చదువుకుంటా! | Inter student asks police to stop her marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దు.. చదువుకుంటా!

Jan 16 2018 8:46 PM | Updated on Jul 11 2019 5:01 PM

Inter student asks police to stop her marriage - Sakshi

సాక్షి, చిన్నశంకరంపేట: తాను ఇంకా చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి వద్దంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన హలావత్‌ బాబు, మరోనిల కూతురు సాంకీ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేద్దామని తండ్రి బాబు తరచూ ఇంట్లో చర్చిస్తున్నాడు. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, ఇంకా చదువుకుంటానని బాలిక తండ్రికి చెబుతున్నప్పటికీ వినకపోగా, బెదిరించడం, కొట్టడం మొదలుపెట్టారు.

దీంతో మైనర్‌ను అయినప్పటికీ పెళ్లి చేస్తానని తన తండ్రి వేధిస్తున్నాడని సాంకీ చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఐసీడీఎస్‌ అధికారులు, తహసీల్దార్‌లతో కలసి ఆయన బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మాయి చదువుకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని, అవసరమైతే బాలసదనంలో ఉంచి చదివిస్తామని ఎస్‌ఐ వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement