ఈ సారైనా.. చర్చిస్తారా?

what will happen in this year zilla parishad general meeting - Sakshi

నేడు 14వ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

రసాభసాగా గత సమావేశం

ఈసారి కొత్త జీపీలపై పట్టుపట్టే అవకాశం?

గైర్హాజరు కావాలని సభ్యుల నిర్ణయం?  

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : మూడు నెలలకోసారి జరిగే జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లో ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చ జరిగలేదు. ఈసారి జరిగే సమావేశం ఏదైనా ప్రతిఫలం ఇస్తుందా.. లేక ఎప్పటిలాగే రచ్చ చేసి ఎవరిదారిన వారు పోతారా.. అనేది వేచి చూడాల్సిందే. జెడ్పీ పాలక మండలి ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు 13 సమావేశాలు జరిగాయి. ఏ సమావేశంలో కూడా రాజకీయ రచ్చ తప్పి స్తే ప్రజా అవసరాలు, సమస్యలపై చర్చ ఏ మాత్రం జరగకపోవడం గమనార్హం.

6 జిల్లాలో 182 అంశాలు 
మొత్తం ఆరు జిల్లాలకు చెందిన 182 అంశాలపై అధికారులు ఎజెండా తయారు చేశా రు. ఇందులో 38 శాఖలకు చెందిన ఎజెం డా కాపీలు జిల్లా పరిషత్‌కు పంపలేదు. గత సమావేశంలో చర్చించిన అంశాలు పరి ష్కారం కావనే అభిప్రాయం సభ్యుల్లో ఉం డగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కావడం లే దు. దీంతో జెడ్పీటీసీ సభ్యులు స మావేశాని కి హాజరయ్యేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ క్రమం లో సమావేశాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
  
చర్చకు రాని ఎజెండాలు...  
పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి ఎజెండాలోని అంశాలు ఎన్నడూ  చర్చకు రాలేదు. ఒక వేళ జరిగినా రెండు, మూడు ఎజెండాలపై మాత్రమే ఎవరైనా మాట్లాడతారు. ఎప్పటికీ తాగునీటి సమస్య (ఆర్‌డ బ్ల్యూఎస్‌),  వ్యవసాయం, ఉపాధి హామీ (డీఆర్‌డీఓ) తప్పితే మరో శాఖ మీద చర్చే  జరగలేదు. ఈ సారి 182 అంశాల ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 38 శాఖల ప్రగతి నివేదికలను జెడ్పీ అధికారుల కు ఆయా శా ఖ అధికారులు ఇంకా సమర్పించనేలేదు. ఉ మ్మడి జిల్లా ఉన్నప్పుడు 68 ఎజెండాలు ఉం టేవి. అప్పుడే మూడుకు మించి అంశాలపై చర్చ జరుగలేదు. కొత్త జిల్లాల ఏర్పడిన నేపథ్యంలో 182 అంశాల ఎజెండా జిల్లా పరిషత్‌ ముందు ఉంది. ఇందులో ఎన్ని అం శాలు చర్చకు వస్తాయో చూడాల్సి ఉంది. మొదటి ఎజెండాగా ఆర్‌డబ్లు్యఎస్‌ శాఖను పెట్టగా.. వ్యవసాయం, ఇరిగేషన్, డీఆర్‌డీ, ఎస్సీ సంక్షేమ శాఖలు ఆ తర్వాత ఉన్నాయి.

కొత్త పంచాయతీలపై ప్రశ్నిస్తారా?
 ప్రభుత్వం ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామపంచాయతీలను ఏ ర్పాటు చేసే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. 500 జనాభా ఉన్న గ్రామపంచాయతీల ప్రతిపాదనలను అధికారులు సి ద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. తమ గ్రా మాన్ని పంచాయతీగా మార్చాలని, లేక వద్ద ట సభ్యులు పట్టు బట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీతో సహా అందరు సభ్యులు నిధుల విషయంలో అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇదే కారణంతో శనివారం జరగనున్న సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.

అనవసర చర్చలు 
జిల్లా పరిషత్‌ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇప్పటిదాక 13 జెడ్పీ సర్వసభ్య సమావేశాలు కొనసాగాయి. గత ఏడాది అక్టోబర్‌ 6వ తేదీన జరిగిన జెడ్పీ సమావేశం మొత్తం రచ్చరచ్చగా జరిగింది. జెడ్పీటీసీ సభ్యులకు తెలియకుండా నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సభ్యుల ఆందోళన చేపట్టారు. అది కాస్తా ఎమ్మెల్యేల ప్రొటోకాల్‌ రగడకు దారి తీసింది. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మధ్య కూడా వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే సభను ముగించారు. ఇలాగే ప్రతి సభలో ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. ప్రతి పక్ష పార్టీ, అధికార పక్ష పార్టీలకు మధ్య వాదోపవాదాలు సర్వసాధారణమయ్యాయి.

ఉన్నది మూడే సమావేశాలు 
జెడ్పీ సమావేశాలు ఇక మూడే ఉన్నాయి.. ఇన్నిరోజులు జరిగిన సమావేశాల్లో ఏ సమస్యా పరిష్కారం కాలేదు. నిధులు లేక జెడ్పీకి వెళ్లలేక పోతున్నాం. ప్రతి మూన్నెళ్లకోసారి సభ నిర్వహించాలని కోరినా నిర్వహించలేని పరిస్థితి నెలకుంది. సభ నిర్వహణ కూడా గందరగోళంగా మారుతోంది. 
– శ్రీహరి, జెడ్పీటీసీ  సభ్యుడు, మక్తల్‌  

నిధులు కేటాయించాలి  
జిల్లా పరిషత్‌కు పూర్వ వైభవం రావాలంటే అధిక నిధులను కేటాయించాలి. తాము ఎన్నికైన మండలంలో అభివృద్ధి పనులు చేపడతామం. నిధులు లేక ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాం.  
– రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు, ఖిల్లాఘనపూర్‌ 

జెడ్పీని బలోపేతం చేస్తాం... 
జిల్లా పరిషత్‌ను బలోపేతం చేస్తాం. త్వరలో ప్రభుత్వం జెడ్పీకి అధిక నిధులను కేటాయించనుంది. జెడ్పీటీసీల గౌరవం పెంచే విధంగా కృషి చేస్తాం. జిల్లా పరిషత్‌ సమావేశాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. పక్షపాత వైఖరి లేకుండా అందరికి సమాన అవకాశం కల్పిస్తాం.  
– బండారి భాస్కర్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top