పార్ట్‌నర్‌తో తరచూ గొడవలా? ఇలా చేయండి!

Tips To Be Calm In A Tense Situation With Partner - Sakshi

ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరగటం అన్నది సర్వసాధారణ విషయం. రిలేషన్‌లో ఉన్న ఇద్దరి వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు ఒకేలా ఉన్నా ఏదో ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటం జరుగుతుంది. అలాంటి సమయంలో గొడవలు జరుగుతుంటాయి. అయితే గొడవను ఎలా సద్దు మనిగించాలని కాకుండా అహాలకు పోతే మాత్రం ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. జంటలో ఎవరో ఒకరు కొద్దిగా వెనక్కు తగ్గటం వల్ల గొడవ సద్దు మనగటమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. గొడవల సందర్భంలో మనం ఈ టిప్స్‌ పాటిస్తే తప్పకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమతో జయించగలుగుతాము.

1) బ్రీత్‌ 
గొడవలు జరిగినపుడు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవటానికి గట్టిగా గాలి పీల్చటం అన్నది ఉపయోగపడుతుంది. మనం కోపంలో ఉన్నపుడు వీలైనన్ని ఎక్కువసార్లు గాలి పీల్చడం వల్ల మన హార్ట్‌బీట్‌ రేట్‌ పెరుగుతుంది. అంతేకాకుండా మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా జరిగి మనసు కుదుట పడుతుంది.

2) మనసును మరల్చండి
బాగా ఆలోచిస్తున్నపుడు లేదా కోపంగా, బాధగా ఉన్నపుడు మన మనసును వేరే ఆలోచనలపైకి మరల్చడం ఉత్తమం. బాధలో ఉన్నపుడు సమస్యలనుంచి దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనిపించినపుడు మనసును కొద్దిగా వేరే ఆలోచనలపైకి మళ్లించటం మంచిది. 

3) ఎదుటి వ్యక్తి స్థానంలోనుంచి..
గొడవలు ఎక్కువగా మనం మనవైపు నుంచి ఆలోచించినపుడు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం వారివైపునుంచి ఆ సమస్యను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు వాళ్లు మనకు అర్థం అవుతారు. గొడవ చల్లారటమే కాకుండా మనకు కూడా కొంత ప్రశాంతత లభిస్తుంది.

4) క్షమించండి! మర్చిపోండి
గొడవలు జరగటం అన్నది రిలేషన్‌షిప్‌లో ఉన్నపుడు సర్వసాధారణం. గొడవ ముగిసినా వాటి గురించే ఆలోచిస్తూ జీవితాన్ని, బంధాన్ని నరకం చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. గొడవను పూర్తిగా మర్చిపోగలగాలి. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top