
భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన మొఖం , గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశ భక్తికి నిలువెత్తు రూపం ..ఆయనే స్వామి వివేకానంద .కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. యువతకు రోల్ మోడల్. స్పూర్తి సందేశాలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త. కేవలం ముప్పై తొమ్మిది సంవత్పరాలు మాత్రమే ఈ భూమ్మీద నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, స్పూర్తిప్రదాతగా వెలుగొందుతున్నారు. అందుకే ఆయన పుట్టినరోజైన జనవరి 12 ను నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు.