ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

IMA Ponzi Scam Mohammed Mansoor Khan Arrested In Delhi - Sakshi

సాక్షి, బెంగళూరు: రూ. వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఐఎంఏ జ్యువెల్లరీ యజమాని మహమ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ అరెస్టయ్యారు. దుబాయ్‌ నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్న ఆయనను ఎయిర్‌పోర్టులోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసినట్లు సిట్‌ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖాన్‌ను ఢిల్లీలోనే ఈడీ విచారిస్తోంది. దుబాయ్‌లో తలదాచుకున్న మన్సూర్‌ భారత్‌కి వచ్చి, కోర్టులో లొంగిపోవడానికి దర్యాప్తు సంస్థలు ఒప్పించినట్లు సిట్‌ అధికారులు తెలిపారు. అధిక వడ్డీలు ఇస్తామనీ, తమ కంపెన్లీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఐఎంఏ గ్రూప్‌ ద్వారా దాదాపు లక్ష మంది నుంచి మొత్తంగా రూ. 4,084 కోట్లను మన్సూర్‌ వసూలు చేశాడు. తర్వాత తాను తీవ్రంగా నష్టపోయాననీ, ఆత్మహత్యే శరణ్యమని ఒక ఆడియో టేప్‌ను జూన్‌ మొదటివారంలో విడుదల చేసి అదృశ్యమయ్యారు.  

(చదవండి : ‘ఇండియా వదిలి వెళ్లడమే నా పెద్ద తప్పు’)

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top