సిలిండర్‌ పేలి ఇద్దరు టెక్కీల మృతి | cylinder explosion killed two softwares | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ పేలి ఇద్దరు టెక్కీల మృతి

Nov 3 2017 11:06 AM | Updated on Nov 3 2017 11:06 AM

cylinder explosion killed two softwares - Sakshi

బనశంకరి :  సిలిండర్‌ పేలిన ఘటనలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఇక్కడి కాడుగోడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వీరాస్వామిరెడ్డి లేఔట్‌లో నివాసం ఉంటున్న హరేంద్ర (34), నరేంద్ర (27) అన్నదమ్ములు. వీరు ఇద్దరు ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టెక్కీలుగా పనిచేస్తున్నారు.

మూడు రోజుల క్రితం వీరి ఇంటిలో సిలిండర్‌ పేలడంతో అన్నదమ్ములతో పాటు నరేంద్ర భార్య శిల్ప, వీరి కుమార్తె ఆర్య తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరేంద్ర, నరేంద్ర గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. నరేంద్ర భార్య శిల్పా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. చిన్నారి ఆర్యను ఢిల్లీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement