సినిమా థియేటర్లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు | task forces rides on cinema theaters | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్లపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

Jan 12 2018 9:11 AM | Updated on Aug 11 2018 8:29 PM

task forces rides on cinema theaters - Sakshi

కరీంనగర్‌ క్రైం: నగరంలోని పలుసినిమా థియేటర్లపై టాస్క్‌ఫోర్స్, తూనికలు కొలతల, ఫుడ్‌సేప్టీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, కమర్షియల్‌ అధికారులు దాడి చేశారు. శివ థియేటర్లల్లో అధిక ధరలకు తినుబండారాలను అమ్మడాన్ని గుర్తించారు. ఏసీటీవో కొండాల్‌రెడ్డి టాక్స్‌ పత్రాలు చూపించాలని అడగగా.. పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. క్లాస్‌ టాయిలేట్స్‌లో పరిస్థితి అధ్వానంగా ఉందని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. రాజా థియేటర్‌లో తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు  గుర్తించి జరిమానా విధించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని శానిటరీ ఇన్పెక్టర్‌ నోటీలు జారీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐలు శ్రీనివాస్‌రావు, మాధవి, కిరణ్, తూనికల కొలతల జిల్లా అధికారి రత్నప్రభ, గెజిటేడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రనాథ్, మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement