అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్‌ | Sakshi
Sakshi News home page

అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్‌

Published Wed, Mar 6 2019 11:12 AM

Chetha Check For Forest Violations - Sakshi

కాగజ్‌నగర్‌: డివిజన్‌ పరిధిలో ఎవరైనా అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్‌ పెట్టనుంది. చీతా అనే పేరు గల జర్మన్‌ షెఫర్డ్‌ జాతికి చెందిన స్నిప్‌ ఫర్‌ డాగ్‌ను డివిజన్‌కు కేటాయించారనీ, దీంతో చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే నిందితులను త్వరగా పట్టుకోవచ్చని కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో రాజారమణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కాగజ్‌నగర్‌ డివిజన్‌ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జన్నారం నుంచి వచ్చిన డాగ్‌ స్క్వాడ్‌ బృందం గురించి వివరించారు.  ఈ డాగ్‌ పేరు చీతా అని ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను దీని సాయంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చీతా చాలా చురుకైన డాగ్‌ అనీ, నేరస్థులతోపాటు అక్రమ వేట సామగ్రిని కూడా గుర్తిస్తుందన్నారు. గత చట్టంలో నిందితులు బెయిల్‌పై వచ్చేవారని, కొత్త చట్టంలో అలాంటి వీల్లేదని ఎఫ్‌డీవో స్పష్టం చేశారు. అడవులను నరికినా, వన్యప్రాణులను వేటాడినా నాన్‌ బెయిలేబుల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎప్‌ఆర్‌వో అనిత, ఎఫ్‌ఎస్‌వో యోగేష్, బీట్‌ ఆఫీసర్‌ బానయ్య, డాగ్‌ స్క్వాడ్‌ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement