మహిళ చేష్టలకు పోలీసులు షాక్ | Woman arrested in France after she asked police officers to check the purity of her cocaine | Sakshi
Sakshi News home page

మహిళ చేష్టలకు పోలీసులు షాక్

Apr 30 2016 3:58 PM | Updated on Aug 21 2018 6:12 PM

మహిళ చేష్టలకు పోలీసులు షాక్ - Sakshi

మహిళ చేష్టలకు పోలీసులు షాక్

అనుమానిత వస్తువుతో పోలీసులకు దొరికితేనే హడలెత్తిపోతుంటాం.. అలాంటిది ఏకంగా అనుమతించకూడని వస్తువుతో నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఇది అదేనా అని అడిగితే పరిస్థితి ఏమిటి? ఫ్రాన్స్లో ఇలాగే జరిగింది.

ఫ్రాన్స్: అనుమానిత వస్తువుతో పోలీసులకు దొరికితేనే హడలెత్తిపోతుంటాం.. అలాంటిది ఏకంగా అనుమతించకూడని వస్తువుతో నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఇది అదేనా అని అడిగితే పరిస్థితి ఏమిటి? ఫ్రాన్స్లో ఇలాగే జరిగింది. ఓ మహిళ మూడు పొట్లాల్లో కొకైన్ తీసుకొని ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అక్కడ రిసెప్షన్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న డ్రగ్స్ను వారి చేతికి ఇచ్చి.. ఇవి నిజంగా డ్రగ్సేనా.. దీనిలో ఎంతమేరకు స్వచ్ఛత ఉందో పరీక్షించి చెప్పగలరా అని అడిగింది. దాంతో అవాక్కయిన పోలీసులు ఆ మహిళను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఆ వెంటనే కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. పోలీసుల వివరాల ప్రకారం టౌలోస్ లోని సౌత్ వెస్ట్రన్ సిటీలో 45 ఏళ్ల మహిళ ఈ పనిచేసింది. ఇలా ఎందుకు చేశావని ఆమెను ప్రశ్నించగా నకిలీ డ్రగ్స్ వాడితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం అయినందున అందులో ఎంత ప్యూరిటి ఉందో తెలుసుకుందామనే అడిగానని చెప్పింది. ప్రజల మేలుకోసం తాను ఇలా చేశానని చెప్పుకొచ్చింది. పోలీసులు మాత్రం ఆమె గతంలో డ్రగ్స్ బానిసరాలు అయ్యుండొచ్చని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement