
నీటిపై పవన విద్యుదుత్పత్తి
గాలితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని పవన విద్యుత్ అంటారనే విషయం మనకు తెలుసు.
లండన్‌లోని బిగ్ బెన్ గడియారం కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ గాలి మరలతో ఏకంగా 20,000 గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. అయితే నీళ్లపై ఈ భారీ స్తంభాలు నిలబడేందుకు స్టాటాయిల్ అనే సంస్థ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిందని, ఈ టెక్నాలజీని మరింతగా, తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకువస్తే పవన విద్యుత్ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ లీఫ్ డెల్ప్ తెలిపారు. దీనికి హైవిండ్ ప్రాజెక్టుగా నామకరణం చేశామన్నారు.