ఎగిరే పైకెగిరే..!

Will We Be Flying In Uber Air Taxis Soon - Sakshi

కాలుష్యం.. ట్రాఫిక్‌.. ఈ రెండు చాలు నగర జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలిపేందుకు. అయితే కొన్ని నగరాల్లో వీటి నుంచి మెట్రోరైలు కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ అంతకు మించిన ఉపశమనాన్ని మనకు అందించేందుకు ఉబర్‌ సంస్థ మరో ముందడుగు వేసింది. గాల్లో ఎగిరే ట్యాక్సీ కార్లను మన ముందుకు తెచ్చింది. దీన్ని చూసేందుకు హెలికాప్టరో.. కారో కూడా అర్థం కాదు. నలుగురు ఎంచక్కా ఈ కారులో వెళ్లొచ్చు. నార్త్‌ స్టార్‌ అనే కంపెనీతో కలసి ఉబర్‌ ఈ కారును డిజైన్‌ చేసింది. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ఉబర్‌ ఎలివేట్‌ సమ్మిట్‌–2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది. అయితే 2020లో తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామని, 2023 వరకు ఎయిర్‌ ట్యాక్సీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనుంది. అతి త్వరలోనే మన దగ్గరికి కూడా రావాలని కోరుకుందాం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top