మమ్మల్ని రెచ్చగొడితే అమెరికాపై అణుదాడి చేస్తాం | will go with nuclear attack on USA if we are provoked, says north korea | Sakshi
Sakshi News home page

మమ్మల్ని రెచ్చగొడితే అమెరికాపై అణుదాడి చేస్తాం

Apr 11 2017 7:24 PM | Updated on Jul 29 2019 5:39 PM

మమ్మల్ని రెచ్చగొడితే అమెరికాపై అణుదాడి చేస్తాం - Sakshi

మమ్మల్ని రెచ్చగొడితే అమెరికాపై అణుదాడి చేస్తాం

అమెరికా యుద్ధనౌకలు పంపుతూ, వాటిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన యుద్ధవిమానాలు కూడా పంపుతూ తమను రెచ్చగొడితే.. తాము చేతులు ముడుచుకుని కూర్చునేది లేదని, తాము కూడా అమెరికా మీద అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా ఘాటుగా హెచ్చరించింది.

అమెరికా యుద్ధనౌకలు పంపుతూ, వాటిలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన యుద్ధవిమానాలు కూడా పంపుతూ తమను రెచ్చగొడితే.. తాము చేతులు ముడుచుకుని కూర్చునేది లేదని, తాము కూడా అమెరికా మీద అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా ఘాటుగా హెచ్చరించింది. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియాలో వెల్లడించారు. సిరియా మీద క్షిపణి దాడులు చేసిన తర్వాత అక్కడి నుంచి అమెరికా యుద్ధనౌకలు ఉత్తరకొరియా దిశగా వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కొరియా తీరంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా గనక ఏమైనా చర్యలు తీసుకుంటే ఉత్తరకొరియా ఆరోసారి అణ్వస్త్ర పరీక్ష చేయొచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికా ఎలాంటి దూకుడు ప్రదర్శించినా దాన్ని ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా అధికారిక వార్తాపత్రిక రాడాంగ్‌ సిన్‌మున్‌ పేర్కొంది.

బలమైన తమ సైన్యం శత్రువు యొక్క ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తోందని, కేవలం దక్షిణ కొరియాలో మాత్రమే కాక.. అమెరికా భూభాగంతో పాటు.. ఆ దేశ యుద్ధక్షేత్రాలు ఎక్కడున్నా వాటిమీద తమ అణ్వస్త్రాల దృష్టి ఉంటుందని ఆ కథనంలో తెలిపింది. కాగా, ఉత్తరకొరియా బాగా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హ్వాంగ్‌ క్యో ఆన్‌ అన్నారు. తమ సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు అమెరికాతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలన్నారు. అసెంబ్లీ వార్షికోత్సవం సహా ఏ వార్షికోత్సవాలు జరిగినా ఉత్తర కొరియా మరోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని హ్వాంగ్‌ చెప్పారు. ఈ శనివారం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాత, ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ 105వ జయంతి. దాంతో రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో సైనిక కవాతు జరుగుతుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ తన అణ్వస్త్ర లేదా క్షిపణి సామర్థ్యాలను ఇలాంటి వార్షికోత్సవాల సమయంలో ప్రదర్శించడం ఉత్తరకొరియాకు అలవాటు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement