అఫ్ఘాన్‌కు చేయూత అందిస్తాం | Will contribute to aphghan says narendra modi | Sakshi
Sakshi News home page

అఫ్ఘాన్‌కు చేయూత అందిస్తాం

Apr 29 2015 1:13 AM | Updated on Mar 28 2019 6:10 PM

అఫ్ఘాన్‌కు చేయూత అందిస్తాం - Sakshi

అఫ్ఘాన్‌కు చేయూత అందిస్తాం

అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపన, సుస్థిరతకు తమ వంతు సహకారం అందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి ప్రధాని నరేంద్రమోదీ హమీనిచ్చారు.

శాంతి, సుస్థిరతకు పాటుపడతాం: ప్రధాని మోదీ
 
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపన, సుస్థిరతకు తమ వంతు సహకారం అందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి ప్రధాని నరేంద్రమోదీ హమీనిచ్చారు. రక్షణ, మౌలిక వసతులు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో సాయం అందిస్తామని చెప్పారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టాక సోమవారం తొలిసారి భారత్ పర్యటనకు వచ్చిన ఘనీ.. మంగళవారం మోదీతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

తాము ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఉగ్రవాదమేనన్నారు. ముష్కర తండాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు స్పష్టంచేశారు. చర్చల అనంతరం ప్రధాని, ఘనీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు, రాజకీయ అడ్డంకులు ఉన్నా ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్నాయని మోదీ అన్నారు. హింసకు తావు లేకుండా అఫ్ఘాన్ అభివృద్ధి మార్గంలో పురోగమించడం ఇరుదేశాలకు ఉపయుక్తమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి పొరుగు దేశాల నుంచి మద్దతు నిలిచిపోయినప్పుడే అప్ఘాన్ అభివృద్ధి సాధ్యమంటూ పరోక్షంగా పాకిస్తాన్ తీరును ఎండగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement