లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఇక అంతే: డబ్ల్యూహెచ్‌ఓ

WHO Warning On Lockdown Conditions Over Corona - Sakshi

భౌతిక దూరం, లాక్‌డౌన్‌తో‌ మాత్రమే వైరస్‌ కంట్రోల్‌

ఆంక్షలను సడలిస్తే తీవ్ర పరిణామాలు : డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా : కరోనా వైరస్‌ కొంతమేర తగ్గుముఖం పట్టిన దేశాల్లో లాక్‌డౌన్‌ సడలింపులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పలు హెచ్చరికలు చేసింది. వైరస్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించవద్దని పలు దేశాలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం, లాక్‌డౌన్‌ మాత్రమే వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయగలవుని స్పష్టం చేసింది. అమెరికా, భారత్‌ లాంటి దేశాలు ఆంక్షలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. ఈమేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీస్ విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. (17దాకా లాక్‌డౌన్‌.. సడలింపులివే..!)

వైరస్‌ కట్టడికి ప్రస్తుతం వివిధ దేశాలు అవలంభిస్తున్న పలు చర్యలు బాగున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ నిబంధనల్ని ఎత్తివేసే దేశాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలనీ సూచించారు. సడలింపులు ఇస్తున్న చోట చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరుగాయని గుర్తు చేశారు. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. ఇక చైనా పరిస్థితిపై స్పందిస్తూ.. ఆ దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించకున్నా సామాజిక దూరం పాటిస్తున్నారని చెప్పారు. దానితోనే చైనీయులు వైరస్‌ను కట్టడిచేయగలిగారని మైక్‌ ర్యాన్‌ స్పష్టం చేశారు. (డబ్ల్యూహెచ్‌వోపై ‘సైబర్‌ అటాక్‌’!)

కాగా భారత్‌లో వైరస్‌ ప్రభావం బట్టి మూడు జోన్లుగా విభజించిన విషయం తెలిసింది. రెడ్‌ జోన్‌ మినహా.. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఆంక్షలతో కూడా సడలింపులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా గుర్తించిన 130 రెడ్‌ జోన్‌లో మాత్రమే పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలుకానుంది. దీనిపై ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు స్థానిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top