బాహు'బల్లి' దడేల్మని తలుపుకొడితే.. | When Godzilla Comes Knocking: Huge Lizard Tries to Enter Home in Thailand | Sakshi
Sakshi News home page

బాహు'బల్లి' దడేల్మని తలుపుకొడితే..

Jun 17 2016 9:05 AM | Updated on Jul 26 2018 5:23 PM

బాహు'బల్లి' దడేల్మని తలుపుకొడితే.. - Sakshi

బాహు'బల్లి' దడేల్మని తలుపుకొడితే..

చిన్న పరిమాణంలో ఉన్న బల్లిని చూస్తేనే సాధరణంగా ఏదోలా అనిపిస్తుంది. అలాంటిది ఓ గాడ్జిల్లా పరిమాణంలో ఉన్న బల్లిని చూస్తే.. అది కూడా ఒక అతిథిలాగా వచ్చి ఇంటి తలుపుకొడితే..

థాయిలాండ్: చిన్న పరిమాణంలో ఉన్న బల్లిని చూస్తేనే సాధరణంగా ఏదోలా అనిపిస్తుంది. అలాంటిది ఓ గాడ్జిల్లా పరిమాణంలో ఉన్న బల్లిని చూస్తే.. అది కూడా ఒక అతిథిలాగా వచ్చి ఇంటి తలుపుకొడితే.. ఊహించుకోగలరా.. సరిగ్గా థాయిలాండ్లో ఇదే జరిగింది. ఓ భారీ మొసలికన్నా పెద్ద ఆకారంలో ఉన్న ఓ బల్లి ఇంటి వద్దకు చేరింది. మెల్లగా పాకుతూ ఇంటి మెట్ల నుంచి గుమ్మం వరకు వెళ్లింది. అనంతరం గోడకు తనతోక సహాయంతో నిల్చొని డోర్ కొట్టింది. అలా ఒకసారి కాదు పలుమార్లు.

ఈలోగా ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ పెద్ద ఆకారాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్లో ఆ భారీ బాహుబల్లిని ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టడం మొదలుపెట్టాడు. అలా ఓ రెండు గంటలపాటు ఫొటోలు పోస్ట్ చేసి తర్వాత ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో బల్లి కదులుతున్న ప్రతిసారి ఓ కుక్క అరుస్తున్న శబ్దం కూడా రికార్డయింది.

తర్వాత ఓ తాడుతో ఆ బల్లిని బందించేందుకు ప్రయత్నిస్తుండగా అది తన తోకతో ఆ డోర్ను ఈ డోర్ ను కొడుతూ చేసిన హంగామాకు వారు బెంబేలెత్తిపోయారు. అనంతరం దానిని బందించి అడవిలో విడిచిపెట్టారు. కాగా, అత్యంత అరుదైన ఈ అతిధి సాధారణంగా ఆ ప్రాంతానికి అప్పుడప్పుడు వస్తుండే అతిథి అని, దానిని సాలెనా అని పిలుచుకుంటారని, అడవిలో వదిలిరావడం తిరిగి అది ఇళ్లలోకి రావడం ఒక ఆనవాయితీలాగా తయారైందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement