అక్రమంగా వైఫై వాడితే దొంగలేనట! | Using Wi-Fi illegally is theft, says Saudi fatwa | Sakshi
Sakshi News home page

అక్రమంగా వైఫై వాడితే దొంగలేనట!

Jun 2 2016 6:27 PM | Updated on Sep 4 2017 1:30 AM

వైఫై సర్వీసులను ఇష్టమొచ్చినట్లు వాడితే దొంగతనం కేసుగా గుర్తిస్తామని సౌదీ అరేబియాలో ఫత్వా విడుదలైంది. మరోకరి వైఫై ఉపయోగించడం కూడా నేరమే అని స్పష్టం చేసింది.

రియాద్: వైఫై సర్వీసులను ఇష్టమొచ్చినట్లు వాడితే దొంగతనం కేసుగా గుర్తిస్తామని సౌదీ అరేబియాలో ఫత్వా విడుదలైంది. మరోకరి వైఫై ఉపయోగించడం కూడా నేరమే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సౌదీ అరేబియన్ స్కాలర్కు నోటీసులు జారీ చేసింది. సీనియర్ స్కాలర్స్ మండలి సభ్యుడూన అలీ అల్ హకామీ అనే వ్యక్తి ఈ ఫత్వాను విడుదల చేశాడు.

'వైఫై సర్వీసును ఇతరుల అనుమతి లేకుండా.. యజమాని పర్మిషన్ ఇవ్వకుండా ఎవరైతే ఉపయోగిస్తారో వారు దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తిస్తాం. ఈ సదుపాయం పొందుతున్న వ్యక్తి చాలా స్పష్టమైన అనుమతి తీసుకోవాలి. ఎవరు వైఫై కోసం డబ్బు చెల్లిస్తారో వారు కచ్చితంగా అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలి' అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement