పోలీసులకు ఫోన్‌: పిచ్చిపట్టిన దానిలా అరుస్తూ..

US Young Woman Scared After Watching Snake In The Car - Sakshi

న్యూయార్క్‌ : పామంటే ఎవరికి మాత్రం భయం ఉండదు. దాన్ని దగ్గరినుంచి చూడగానే గజగజ లాడిపోతాము. ఆ సమయంలో ఏం చేస్తామో మనకే తెలియదు. అలాంటిది మనం నడుపుతున్న కారులో, మన ముందే పాముంటే!.... మన పరిస్థితి గురించి పక్కన పెడితే అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం హిస్టీరియా వచ్చిన దానిలా ప్రవర్తించింది. పోలీసులకు ఫోన్‌ చేసి, గట్టిగా అరుస్తూనే సహాయం కోసం అర్థించింది. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరిలో ఆసల్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గత గురువారం మిస్సోరికి చెందిన ఓ యువతి హైవేపై కారులో వెళుతోంది. కొద్దిసేపటి తర్వాత డ్రైవింగ్‌ సీటు దగ్గర ఓ పామును ఆమె చూసింది. అంతే! పిచ్చిపట్టిన దానిలా గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ( 30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు‌ చూసి..)

కారును రోడ్డు పక్కన ఆపి బయటికి పరుగులు తీసింది. ఆ వెంటనే అరుస్తూనే పోలీసులకు ఫోన్‌ చేసింది. వారితో గట్టిగా అరుస్తూనే సహాయం కోసం అర్థించింది. పోలీసుల సూచనల మేరకు ఆమె తన కారును వారు చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లింది. అయితే పోలీసులు పామును బయటకు తీసే ప్రయత్నం చేయకుండానే అది కారునుంచి దిగి దాని దారిన వెళ్లిపోయింది. యురెకా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ సంఘటనపై స్పందిస్తూ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో న్యూస్‌ కాస్తా వైరల్‌గా మారింది. ( 'ఇది త‌యారు చేసినవాడిని చంపేస్తా’ )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top