కోమా నుంచి కోలుకున్న భర్తకు భార్య లేదని తెలిసి

US Man Woke From Coma and Learned Wife Died Of Coronavirus - Sakshi

వాషింగ్టన్‌: లారెన్స్‌ నోక్స్‌(69) మేరిల్యాండ్‌లోని ప్లీజంట్‌ వ్యూ నర్సింగ్‌ హోంలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించాడు. అతని రాష్ట్రంలో కరోనా విజృంభించడానికి వారం రోజుల ముందు వరకు కూడా అతడు విధులు నిర్వహించాడు. ఈ ఏడాది మార్చి 30న లారెన్స్‌ అనారోగ్యం పాలయ్యాడు. దాంతో కటుంబ సభ్యులు లారెన్స్‌ను కారోల్ హాస్పిటల్ సెంటర్‌లో చేర్పించారు.  అనారోగ్యంతో కోమాలోకి వెళ్లిన లారెన్స్‌ వారం తర్వాత కోలుకున్నారు. ఇక అతడికేం పర్వాలేదని వైద్యులు చెప్పారు.

కోమాలో నుంచి కోలుకున్న వెంటనే లారెన్స్‌ అడిగిన మొదటి ప్రశ్న మిన్నేట్‌ నోక్స్‌(71) ఎక్కడ అని. ఆ ప్రశ్న వినగానే కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయ్యింది. నిజం చేప్తే ఎంత ప్రమాదమో వారికి తెలుసు. అందుకే సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ లారెన్స్‌ పదే పదే అడగటంతో సమాధనం చెప్పక తప్పలేదు. మిన్నేట్‌ ఇక లేరనే చేదు విషయాన్ని లారెన్స్‌కు చెప్పారు. ఆ సమాధానం విన్న లారెన్స్‌ క్షణం పాటు స్తంభించిపోయారు. తాను విన్నది అబద్దం అయితే బాగుండని దేవుడిని ప్రార్థించారు.  అసలు కోమా నుంచి ఎందుకు కోలుకున్నానా అని రోదించారు.

అవును మరి గత 24 ఏళ్లుగా క‍ష్ట సుఖాల్లో తనతో కలసి జీవించిన మనిషి ఇక లేదని తెలిస్తే ఆ బాధ వర్ణణాతీం. అది జీవిత చరమాంకంలో. ఈ విషాదం లారెన్స్‌ను కృంగదీసింది. మిన్నేట్‌ లేని చోట తను ఉండలేను అనుకున్నాడు. అందుకే పిల్లల్ని పిలిచి ఇక తనకు ఎలాంటి వైద్యం అందించ కూడదని చెప్పారు. ఆ బాధతో ఏప్రిల్‌ 15న చివరి శ్వాస విడిచారు లారెన్స్‌. (కరోనా: థానే కలకలం.. కోయంబేడు కలవరం)

ఈ విషయం గురించి లారెన్స్‌ కుమార్తె మాట్లాడుతూ.. నాన్నకు కరోనా పాజిటీవ్‌ అని తేలడంతో ఆస్పత్రిలో చేర్పించాం. నాన్న ఆరోగ్యం గురించి అమ్మ చాలా దిగులుపడింది. ఆ బాధతోనే ఏప్రిల్‌ 7న గుండెపోటుతో నిద్రలోనేమరణించింది. తర్వాత డాక్టర్లు అమ్మకు  కరోనా పాజిటీవ్‌ అని తేల్చారు. కోమా నుంచి బయటకు వచ్చిన నాన్న అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు. అందుకే ఆమె చనిపోయిన వారం రోజులకే తను ఈ లోకం నుంచి వెళ్లి పోయాడు అంటూ కన్నీటిపర్యంతం అయ్యింది.
చదవండి: ఇక 'కోవిడ్‌' లైఫ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top