అమెరికాలో.. శిక్ష విధించిన కాసేపటికే పెళ్లి... | US Judge Conducts Wedding of Murderer Minutes after Imposing 53-Year Jail Term | Sakshi
Sakshi News home page

అమెరికాలో.. శిక్ష విధించిన కాసేపటికే పెళ్లి...

Oct 2 2013 5:43 AM | Updated on Sep 1 2017 11:17 PM

అమెరికాలో ఒక వ్యక్తికి హత్య కేసులో ఏకంగా 53 ఏళ్ల శిక్ష విధించిన జడ్జి, తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికి అదే నేరస్తుడి పెళ్లికి పెద్దరికం వహించారు.

లాస్‌ ఏంజెలెస్‌: అమెరికాలో ఒక వ్యక్తికి హత్య కేసులో ఏకంగా 53 ఏళ్ల శిక్ష విధించిన జడ్జి, తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికి అదే నేరస్తుడి పెళ్లికి పెద్దరికం వహించారు. ఇదివరకు ఎక్కడా కని విని ఎరుగని ఈ సంఘటన శాండియాగో కోర్టులో జరిగింది. డేన్‌ డెస్‌బ్రో (36) అనే వ్యక్తిని పదేళ్ల నాటి హత్య కేసులో దోషిగా తేల్చిన శాండియాగో సుపీరియర్‌ కోర్టు జడ్జి పాట్రీషియా కుక్సన్‌, అతడికి 53 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కొద్దిసేపటికే, అతడు కోరుకున్న డెస్టినీ (33) అనే యువతితో కోర్టులోనే పెళ్లి చేశారు. నిర్బంధంలో ఉన్న నేరస్తులకు జడ్జిలు పెళ్లిళ్లు జరపడం అంత అసాధారణం కాకపోయినా, ఒక నేరస్తుడికి దాదాపు జీవితకాలం శిక్ష విధించిన జడ్జి, అదే నేరస్తుడికి పెళ్లి జరిపించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement