breaking news
Destiny
-
గెలుపోటముల వెనుక దైవయోగం!
ఇద్దరు సమఉజ్జీల మధ్య పెద్ద యుద్ధం జరుగుతున్నది. ఇద్దరూ ఘనులే. తమ తమ శక్తి సామర్థ్యాలలో తమ తమ దేశాలను ఏకచ్ఛత్రంగా ఏలి, ఎంతో వైభవం అనుభవించిన వాళ్లే. చివరికి యుద్ధంలో ఒకడు ఘన విజయం సాధించాడు. మరొకడు ఘోర పరాజయం పాలయ్యాడు. గెలిచిన వాడు, ‘‘నేను నా శత్రువు కంటే నూటికి నూరు పాళ్లు ఎక్కువ బలశాలిని, పరాక్రమశాలిని, వ్యూహ చతురుడిని, ధీమంతుడనైన వాడిని. అందుకే నా శత్రువును మట్టి కరిపించాను’’ అంటాడు.ఓడిన వాడు మాత్రం, ‘‘ఓడే వరకూ నేనూ అలాగే అనుకొనే వాడినే. ఇంతకు పూర్వం నేనూ ఎన్నో యుద్ధాలు గెలిచిన వాడినే. ఈ శత్రువుకంటే గొప్ప బలశాలురను ఓడించిన శూరుడినే. కాలం, దైవం కలసి రాక ఈరోజు నా శౌర్యం పని చేయలేదు. అలాగే ఈరోజు కాలం, దైవం అనుకూలించి నా శత్రువు విర్రవీగుతున్నాడు గాని, ఈయన పూర్వం ఎందరి చేతిలోనో ఓడిన వాడే. రేపు నాకు మంచి రోజులు వస్తే, మళ్లీ నా చేతిలో చిత్తుగా ఓడిపోతాడు!’’ అంటాడు.చరిత్రలో ఇటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. వ్యక్తుల జీవితాలను మలుపులు తిప్పే ప్రధాన ఘట్టాలన్నింటిలోనూ వాళ్ల స్వయంకృషితో పాటు, వాళ్ల చేతిలోలేని, అనుకోని అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. వజ్రం తృణాయతే, రాజన్ దైవ యోగాత్ న సంశయః/ తృణం వజ్రాయతే క్వాపి సమయే, దైవ యోగతః అంటుంది సుభాషితం. కొన్ని సమయాలలో, వజ్రం కూడా విలువ కోల్పోయి, గడ్డి పరక పాటి చేయదు. కారణం ‘దైవ యోగం’. అదే దైవ బలం వల్ల మరొకప్పుడు, గడ్డి పోచ కూడా వజ్రమంత విలువ పొందుతుంది.– ఎం. మారుతి శాస్త్రి -
నాకేం తెలియదు.. అంతా నా భర్తే చూసుకుంటాడు
ఆంధ్రప్రదేశ్: కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని పలువురి నుంచి నగదు వసూలు చేసి మోసం చేసిన కేసులో యూట్యూబర్ జాగర్లమూడి రమా నందన (నందు) మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా డెస్టినీ కన్సెల్టెన్సీలో ఆమె పాత్ర, దాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై ఆమెను పోలీసులు ప్రశ్నించారు.ఈ అంశంపై తనకు ఏమీ తెలియదని అంతా తన భర్త మధుకర్ చూసుకుంటారని రమానందన చెప్పారని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో ఆమె భర్తను కూడా విచారణకు పిలుస్తామని, సరైన సమాధానాలు రానందున ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని రమానందనకు నోటీసు ఇచ్చామని వెల్లడించారు. యూట్యూబ్‌లోని నందూస్ వరల్డ్ చానల్‌ను ఉపయోగించి వాట్సాప్ గ్రూప్ ద్వారా కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రమా నందన మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.యూకే గవర్నమెంట్ అధికారిక రికార్డుల మేరకు అన్నే రమా నందన పేరిట నందూస్ కెఫే లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్, స్మైల్ హెల్త్‌కేర్ సరీ్వసెస్ లిమిటెడ్ సంస్థలు సృష్టించినట్లు విచారణలో తేల్చారు. ఈ కంపెనీలను వీసా స్పాన్సర్íÙప్స్ చూపించడానికి ఫండ్స్ మళ్లించడానికి వినియోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీసాల పొడిగింపు, స్పాన్సర్షిప్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమానందన చేసిన మోసాలు, ఆర్థిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై రమా నందన, ఆమె భర్త మధుకర్, మామయ్య మోహనరావులపై కేసు నమోదవ్వగా..మోహనరావును ఇప్పటికే అరెస్ట్ చేశారు.అద్దంకిలోనూ వసూళ్లు?: ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా ఉద్యోగాల పేరుతో నగదు వసూలు చేసినట్లు రమా నందనపై ఆరోపణలున్నాయి. అద్దంకికి చెందిన ఉప్పలపాటి నవీన్ ఉద్యోగం కోసం రూ.18 లక్షలు ఇచ్చినట్లు నవీన్ తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి పోలీసులతో ఇబ్రహీంపట్నం వచ్చిన రమా నందనకు 41ఏ నోటీసులు ఇవ్వబోయారు.అయితే ఇప్పుడు తాను నోటీసులు తీసుకోనని, మొగల్రాజపురంలో ఉంటున్నానని అక్కడకు వచ్చి ఇస్తే తీసుకుంటానని అడ్రెస్ చెప్పి ఆమె వెళ్లిపోయారు. అంతకు ముందు స్టేషన్లోకి రమా నందన వెళ్లే క్రమంలో ఆమె లాయర్లు, విలేకరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో విలేకరులు స్టేషన్ ముందు ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు సర్దిజెప్పి వివాదాన్ని ముగించారు. -
ప్రాప్తం
‘‘ప్రతి బియ్యపు గింజ మీదా ఒకరి పేరు రాసి ఉంటుంది. దాన్ని తినే ప్రాప్తం ఉన్న వారికే అది దక్కుతుంది’’ అని ఊర్లోని ఓ పెద్దాయన అందరికీ చెప్పేవాడు. మంచి జీవితానుభవం ఉన్న ఆ ఊరి పెద్ద అలా చెప్పిన ప్రతిసారీ ఓ రైతు ఒప్పుకునే వాడు కాదు. అలా ఎలా అవుతుందని గట్టిగా వాదించే వాడు. ఇదిలా ఉండగా..ఊర్లో ఒకరోజు వినాయకుని గుడి దగ్గర పెళ్లి జరుగుతోంది. ఆ విందుకు ఊర్లో వాళ్ళందరూ హాజరయ్యారు. పెళ్ళికి హాజరైన రైతు విస్తరిలో వడ్డించిన వేటినీ వృథా చేయకుండా కడుపునిండా తిన్నాడు. విస్తరిలో పెళ్ళి వారు పెట్టిన అరటిపండు చేతిలో పెట్టుకుని బయటికి వచ్చాడు. ఆ రైతుకు పెళ్ళికి వచ్చిన ఊరి పెద్ద ఎదురయ్యాడు.‘‘ఈ అరటి పండు పెళ్ళి వారు ఇచ్చారు, నేను తింటున్నాను. దీన్ని ప్రాప్తమని చెబితే ఎలా? నా చేతిలోని అరటి పండు నాది కాకుండా పోతుందా? ఇది నూటికి నూరు పాళ్ళు నాకే సొంతం కదా’’ అని ఆవేశంగా అన్నాడు. ‘ఎవరికి ఏది ప్రాప్తమో అది తప్పక వారి చేతికి చేరి తీరుతుంది’ అని ఊరి పెద్ద సర్ది చెప్పబోయాడు. ఇంతలో రైతు భార్య గుడి నుంచి బయటికి వచ్చింది. ఆమె చంకన నాలుగేళ్ళ ముద్దుల మనవడు ఉన్నాడు. వాడు తాత చేతిలోని అరటి పండును కొద్దిసేపు కన్నార్పకుండా చూశాడు. చేతి వేలు చూపిస్తూ ఆ అరటిపండు కావాలని అడిగాడు.ఆ రైతు దబాయింపు ధోరణిలో ‘‘ఇది నాది, నీకు కావాల్సి ఉంటే వేరే పండు ఇప్పిస్తాను. ఇక్కడ అరటిపళ్లు దండిగా ఉన్నాయి’’ అని చెప్పాడు. మనవడిని తీసుకెళ్ళి పెళ్ళి వారు పక్కన పెట్టి ఉన్న గెలలను చూపాడు. వాడు అవేవీ వద్దని, తాత చేతిలోని అరటిపండే కావాలని గట్టిగా ఏడుస్తూ నేల మీద పడి దొర్లడం ప్రారంభించాడు.అన్ని పండ్లూ ఒకటేనని అవ్వాతాతా ఎంత సముదాయించినా వాడు వినలేదు, మరింత గట్టిగా ఏడుస్తూ వొంటినున్న చొక్కాను చింపుకోబోయాడు. చేసేదేమీ లేక రైతు తన చేతిలోని అరటి పండును మనవడి చేతికి ఇచ్చాడు. వాడు దాన్ని గబగబా తినేసి తాత చేతికి తొక్కనిచ్చాడు. జరిగిన తంతు చూసి ముసిముసిగా నవ్వుతూ పెళ్ళి జరిగే చోటికి వెళ్ళాడు ఊరి పెద్ద. చేతిలోని తొక్కను దూరంగా విసిరేస్తూ ‘దేనికైనా ప్రాప్తముండాలి’ అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు రైతు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఎవరు వారు? ఎచటి వారు? తప్పదిక వార్..!
డెస్టిని 2 ఫ్రీ–టు–ప్లే ఫస్ట్ పర్సన్ షూటర్ వీడియో గేమ్. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందించిన గేమ్ ఇది. ఒరిజినల్ మాదిరిగానే ఈ గేమ్‌లోని మూమెంట్స్ ప్లేయర్స్ వర్సెస్ ఎన్విరాన్మెంట్(పివిఇ), ప్లేయర్ వర్సెస్ ప్లేయర్(పివిపి)గా విభజించబడి ఉంటాయి.‘పివిఇ’లో ఆరు–ప్లేయర్ రైడ్స్ ఉంటాయి. ప్రతి గమ్యస్థానానికి పెట్రోలింగ్ మోడ్ అందుబాటులో ఉంది. వివిధ గ్రహాంతరవాసుల నుండి మానవజాతిని రక్షించడానికి ప్లేయర్స్ ‘గార్డియన్’ పాత్రను పోషించాల్సి ఉంటుంది.సిరీస్: డెస్టిని,ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, విండోస్, స్టాడియా. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: ఫస్ట్–పర్సన్ షూటర్, ఎంఎంవోజీమోడ్: మల్టీ ప్లేయర్ఇవి చదవండి: Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం! -
కర్మను నమ్ముతారా? ఈ వీడియోను చూడాల్సిందే: ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: ఎంఅండ్ఎం అధినేత, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. అనూహ్యంగా.. తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పుకున్న ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. కర్మ, విధి ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే మీరు ఈ వీడియోను ఒకసారి చూడాల్సిందే ..ఈ విషయంలో పునరాలోచనలో పడతారు అంటూ దీన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో ఏముందంటే.. ఒక యువకుడు ఒక ప్లేస్‌లో రైలింగ్ వద్ద నిలబడి ఉంటాడు. దేని కోసమో ఎదురుచూస్తున్న అతగాడు కాజువల్‌గా అలా నడుచు కుంటూ కాస్తముందుకు వెళతాడు. అలా వెళ్లిన మరుక్షణమే ఒక కారు వేగంగా దూసుకొస్తుంది. అలా లిప్తపాటులో ప్రాణాపాయం నుంచి బయట పడటం మాత్రమే కాదు.. ఏ చిన్న గాయం కూడా కాకుండా భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంటాడు. కర్మ అనేది మనం చేసిన క్రియలకు ప్రతిఫలం. నిజంగా అతడు అదృష్టవంతుడు. నిజమే సార్.. కర్మను లేదా విధిని నమ్మాల్సిన విషయమే. ఈ వ్యక్తికి దీర్ఘాయుష్షు ఉంది. అందుకే సరైన సమయంలో ఆ ప్లేస్నుంచి దూరం జరిగాడు అంతా దైవ లీల అంటూ పలువురు కమెంట్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ల రూపంలో తెలియజేయండి! If you didn’t believe in Karma or Destiny, this may make you think again… ! pic.twitter.com/OtPn1P4rhJ — anand mahindra (@anandmahindra) May 5, 2023 -
అమెరికాలో.. శిక్ష విధించిన కాసేపటికే పెళ్లి...
లాస్ ఏంజెలెస్: అమెరికాలో ఒక వ్యక్తికి హత్య కేసులో ఏకంగా 53 ఏళ్ల శిక్ష విధించిన జడ్జి, తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికి అదే నేరస్తుడి పెళ్లికి పెద్దరికం వహించారు. ఇదివరకు ఎక్కడా కని విని ఎరుగని ఈ సంఘటన శాండియాగో కోర్టులో జరిగింది. డేన్ డెస్బ్రో (36) అనే వ్యక్తిని పదేళ్ల నాటి హత్య కేసులో దోషిగా తేల్చిన శాండియాగో సుపీరియర్ కోర్టు జడ్జి పాట్రీషియా కుక్సన్, అతడికి 53 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కొద్దిసేపటికే, అతడు కోరుకున్న డెస్టినీ (33) అనే యువతితో కోర్టులోనే పెళ్లి చేశారు. నిర్బంధంలో ఉన్న నేరస్తులకు జడ్జిలు పెళ్లిళ్లు జరపడం అంత అసాధారణం కాకపోయినా, ఒక నేరస్తుడికి దాదాపు జీవితకాలం శిక్ష విధించిన జడ్జి, అదే నేరస్తుడికి పెళ్లి జరిపించడం విశేషం.


