ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు | US girl injured after iPhone blasts in her pocket | Sakshi
Sakshi News home page

ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు

Oct 21 2014 3:52 PM | Updated on Apr 4 2019 5:12 PM

ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు - Sakshi

ప్యాంటు జేబులో పేలిన ఐఫోన్.. బాలికకు గాయాలు

ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐఫోన్ ఒక్కసారిగా పేలి.. అంటుకోవడంతో అమెరికాలో ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి తీవ్రంగా గాయపడింది.

ప్యాంటు జేబులో పెట్టుకున్న ఐఫోన్ ఒక్కసారిగా పేలి.. అంటుకోవడంతో అమెరికాలో ఓ ఎనిమిదో తరగతి అమ్మాయి తీవ్రంగా గాయపడింది. ఆమె తరగతి గదిలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఆమెకు తొడ మీద, వీపు మీద కాలిన గాయాలయ్యాయి. మైనె ప్రాంతంలోని కెన్నెబంక్స్ మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ అమ్మాయిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

తాను వేసుకున్న ప్యాంటు కాలిపోతోందని ఆమె చెప్పడంతో వెంటనే ముందు క్లాసులోని పిల్లలందరినీ బయటకు పంపేశారు. తర్వాత ఆమె కింద కూర్చుండిపోయిందని పాఠశాల ప్రిన్సిపల్ జెఫ్రీ రాడ్మన్ తెలిపారు. ఆమె వెంటే గదిలో ఓ మూలకు వెళ్లిపోయి ప్యాంటు తీసేసిందని, ముందుగా స్కూల్లో ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలించామని అన్నారు. ప్యాంటు మీద చాలా చిరుగులు పడ్డాయని, తరగతి గది అంతా విపరీతంగా పొగ చూరిపోవడంతో కిటికీలు కూడా తెరిచామని వివరించారు. ఫోన్ ఎందుకు పేలిందన్న విషయాన్ని ఆ రాష్ట్ర ఫైర్ మార్షల్ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement