
హిందువులకు మలేసియా వర్సిటీ క్షమాపణలు
హిందు, సిక్కు మతాల గురించి ఆన్‌లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన మలేసియా వర్సిటీ భారత్‌కు క్షమాపణ చెప్పింది.
కౌలాంలాపూర్: హిందు, సిక్కు మతాల గురించి ఆన్‌లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన మలేసియా వర్సిటీ భారత్‌కు క్షమాపణ చెప్పింది. మలేసియా ఆరోగ్య, విద్యాశాఖ ఉపమంత్రి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, పశ్చాత్తాపం వ్యక్తం చేశారని కౌలాలాంపూర్లోని భారత హైకమిషన్ తెలిపింది. ‘ఇస్లాం మతం భారతదేశంలోని హిందువులకు జీవించడం నేర్పింది. సిక్కు మత గురువు గురునానక్ పేదవాడు. అతనికి ఇస్లాం మతం గురించి ఏమీ తెలియదు. హిందూమతాన్ని అనుసరించేవాడు’ అని వర్సిటీ ఆన్‌లైన్‌లో మంగళవారం వ్యాసం ప్రచురించింది.
దీనిపై క్షమాపణ చెప్పాలని మలేసియా ఇండియన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆందోళన చేసింది. దాదాపు మూడు కోట్ల జనాభా కలిగిన మలేసియాలో 60 శాతం ముస్లింలు కాగా 25 శాతం క్రిస్టియన్లు, బౌద్ధులు, 8 శాతం హిందువులు ఉన్నారు. ఈ ఘటనపై విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.