నీటి అడుగున నిద్రపోదామా? | Underwater sleep | Sakshi
Sakshi News home page

నీటి అడుగున నిద్రపోదామా?

Dec 4 2014 3:03 AM | Updated on Sep 2 2017 5:34 PM

నీటి అడుగున నిద్రపోదామా?

నీటి అడుగున నిద్రపోదామా?

ఎలాగుంది అదిరిపోలే.. ఇదో ఐదు నక్షత్రాల అండర్‌వాటర్ రిసార్ట్. టాంజానియాలోని పెంబా ద్వీపంలో ఇటీవల ప్రారంభించారు.

ఎలాగుంది అదిరిపోలే.. ఇదో ఐదు నక్షత్రాల అండర్‌వాటర్ రిసార్ట్. టాంజానియాలోని పెంబా ద్వీపంలో ఇటీవల ప్రారంభించారు. పేరు మాంటా అండర్‌వాటర్ రూం. ఈ రిసార్ట్‌లో మొత్తం మూడంతస్తులుంటాయి. పైన బాల్కనీ, దాని కింద డైనింగ్ ఏరియా ఉంటుంది. బెడ్రూం మాత్రం నీటిలో 13 అడుగుల లోతున ఉంటుంది. చేపలు, ఆక్టోపస్‌లు వంటివి మన చుట్టూ చక్కర్లేస్తుంటే.. వాటిని చూస్తూ.. ముచ్చట్లాడుతూ.. నిద్రపోవచ్చన్నమాట. ఇది ఆఫ్రికాలోని తొలి అండర్‌వాటర్ హోటల్ అట. అయితే.. ఖర్చు కాసింత ఎక్కువే. ఒక్క రోజు బసకు రూ.93 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement