యూకేలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ తరహా ఘటన.. పోలీసులపై వేటు

UK Cop Suspended For Kneeling On Suspect During Arrest - Sakshi

లండన్‌: అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి తర్వాత ‘బ్లాక్‌లైవ్స్‌ మ్యాటర్’ ఉద్యమం‌ ఉధృతంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి లండన్‌లో చోటు చేసుకుంది. పోలీసు అధికార్లు మారణాయుధాన్ని కలిగి ఉన్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఓ అధికారి అతడిని కిందపడేసి మెడ మీద మోకాలు పెట్టి కూర్చున్నాడు. దాంతో ఆ వ్యక్తి ‘నా మెడ మీద నుంచి లేవండి’ అంటూ వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో బ్రిటీష్‌ పోలీసులు ఇందుకు బాధ్యులైన వారిలో ఒక అధికారిని సస్పెండ్‌ చేశారు. మరొకరిని విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణలో మేం ఇలాంటి పద్దతులను బోధించలేదు. ఇప్పుడు వీరు ఉపయోగించే పద్దతులు చూస్తే నాకు చాలా ఆందోళన కల్గుతుంది’ అన్నారు. (‘అలాంటి వారికి ట్రంప్‌ తోడయ్యారు’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top