యూకే వీసా కఠినతరం | UK considers further visa crackdowns for non-EU nationals including Indians | Sakshi
Sakshi News home page

యూకే వీసా కఠినతరం

Sep 1 2016 12:51 PM | Updated on Sep 4 2017 11:52 AM

ఐరోపా కూటమి బయటి దేశాల వారికి వీసా నిబంధనలను యూకే ప్రభుత్వం కఠినతరం చేస్తోంది.

లండన్: ఐరోపా కూటమి బయటి దేశాల వారికి వీసా నిబంధనలను యూకే ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. దీని ప్రభావం భారతీయులపై కూడా పడనుంది. వలసదారుల సంఖ్యను అతి తక్కువకు పరిమితం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీసా నిబంధనలను కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలను బ్రిటన్ ప్రధాని థెరిసా మే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐరోపా బయటి దేశాల నుంచి, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల నుంచి యూకేకు చదువుకోడానికి వచ్చే విద్యార్థుల సంఖ్యలో ఇప్పటికే భారీ తరుగ్గుదల ఉన్నట్లు ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) చెప్పింది. యూకే అత్యధికంగా విద్యార్థి వీసాలు మంజూరు చేసే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement