డేటా బ్రీచ్‌ : ఉబెర్‌కు అతి భారీ జరిమానా

Uber to pay record Usd148 million over 2016 data breach - Sakshi

కాలిఫోర్నియా: ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఊబెర్‌కు అమెరికాలో భారీ షాక్‌ తగిలింది. 2016 నాటి డేటా బ్రీచ్‌ ఆరోపణలకు సంబంధించి సంస్థకు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా చెల్లించాల్సి  ఉంది. ఉబెర్‌ డ్రైవర్లు, కస్టమర్ల డేటాను చోరీ చేసిన కేసులో ఊబెర్ సంస్థకు ఈ పెనాల్టీ  పడింది.  ఇది అతి పెద్ద బహుళ డేటా ఉల్లంఘన పరిష్కారమని న్యూయార్క్ అటార్నీ జనరల్ బార్బారా వ్యాఖ్యానించారు.

2016 లో హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ల ( 5.7 కోట్లు) వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం ద్వారా రైడ్-షేర్ కంపెనీ  డేలా చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరిలో 25 .6 మిలియన్ల అమెరికన్‌ యూజర్లు ఉన్నారు. 6లక్షలమంది డ్రైవర్ లైసెన్స్ నంబర్లతో సహా, 10లక్షలకు పైగా ఉబెర్‌ యూజర్ల ఫోన్‌ నెంబర్లు, ఈ మెయిల్స్‌ చోరీకి గురయ్యాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగిన ఈ కేసులో అమెరికా రాష్ట్రాల‌కు భారీ మూల్యం చెల్లించనున్నట్లు ఊబర్ అంగీకరించింది. అమెరికాలోని 50 రాష్ర్టాలతో పాటు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాకు సుమారు 148 మిలియన్ల డాలర్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఆ రాష్ట్రాల మధ్య పంపిణీ అవుతుంది.

మరోవైపు ఊబెర్ కొత్త చీఫ్ కొష్రోవ్‌షాహి నవంబర్ లో ఉల్లంఘనను అంగీకరించారు. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై తమ కస్టమర్ల డాటాను సురక్షితంగా, భద్రగా ఉంచుతామని ఉబెర్‌ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలతో నిర్మాణాత్మక , సహకార సంబంధాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. డేటా ప్రైవసీ నియంత్రణపై ఒక మానిటర్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపింది.

కాగా ఇప్పటికీ రైడర్స్, డ్రైవర్ల డేటా ఉల్లంఘనపై చికాగో, లాస్ ఏంజిల్స్ నగరాల నుంచి ఉబెర్‌ వ్యాజ్యాలని ఎదుర్కొంటోంది. డేటా ఉల్లంఘనపై ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగిన సంస్థఅప్పటి చీఫ్‌ ప్రైవసీ అధికారిపై వేటు వేసింది. అలాగే గత జులైలో ఇద్దరు ఆఫీసర్లను నియమించుకుంది. రుబీజెఫోను ప్రధాన గోప్యతా అధికారిగాను, మట్‌ ఓల్స్‌ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌నుగాను నియమించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top