రాజకీయ ప్రచారానికి ట్విట్టర్‌ నో! | Twitter CEO Jack Dorsey announces ban on all political advertisements | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రచారానికి ట్విట్టర్‌ నో!

Nov 1 2019 5:29 AM | Updated on Nov 1 2019 5:29 AM

Twitter CEO Jack Dorsey announces ban on all political advertisements - Sakshi

ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్‌ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement