ట్రంప్ లైంగికంగా వేధించారు | Trump was sexually harassed | Sakshi
Sakshi News home page

ట్రంప్ లైంగికంగా వేధించారు

Oct 16 2016 1:01 AM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్ లైంగికంగా వేధించారు - Sakshi

ట్రంప్ లైంగికంగా వేధించారు

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ!

- మరో ఇద్దరు మహిళల ఆరోపణ
- అంతా అబద్ధమన్న డొనాల్డ్ ట్రంప్
 
 వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ!  ఆయన తమను లైంగికంగా వేధించారంటూ మరో ఇద్దరు మహిళలు ఆరోపించారు.  టీవీ రియాలిటీ షో ‘అప్రెంటీస్’ మాజీ అభ్యర్థి సమ్మర్ జర్వోస్, జెస్సికా లీడ్స్ ఈ ఆరోపణలు చేశారు. ట్రంప్ 2007లో తనపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని జర్వోస్ ఆరోపించగా.. 1980ల్లో విమానంలో తాము పక్కపక్కనే కూర్చుని ప్రయాణిస్తున్నపుడు ట్రంప్ తనను ముద్దుపెట్టుకున్నాడని జెస్సికా వెల్లడించారు.

ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపడేశారు. శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఆ మహిళల ఆరోపణలు అంతా అబద్ధాలని చెప్పారు. మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. వరుస ఆరోపణలతో తానో బాధితుడిగా మారుతున్నానన్నారు. మహిళలను చులకన చేసి మాట్లాడారని, వేధించారని ట్రంప్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement