మాస్కులు ధరించమని ఆదేశించలేను: ట్రంప్‌

Trump Says He Wont Force People To Wear Masks - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తు నిరంతరం వార్తల్లో ఉంటారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రపంచ దేశాధినేతలు ప్రజలకు మాస్క్‌లు ధరించాలని పిలుపునిస్తే, ట్రంప్‌ మాత్రం అందుకు విరుద్ధంగా మాస్క్‌లు ధరించమని ప్రజలను ఆదేశించలేనని, ప్రజల స్వేచ్ఛకు వదిలేయాలని తాను కోరుకుంటానని అన్నారు. అయితే అమెరికా‌కు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ మాత్రం భారీ జనసమూహాలలో మాస్క్‌లు ధరించాల్సిన అవసరాన్ని రాజకీయ నాయకలు ప్రజలకు తెలియజేయాలని ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కాగా ట్రంప్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ప్రజలందరు మాస్క్‌లు ధరించాలనే నిబంధనను తాను వ్యతిరేకిస్తానని, మాస్క్‌లు వేసుకున్నంత మాత్రాన పూర్తిగా వైరస్‌ను నియంత్రించలేమని అభిపప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు మాస్క్‌ ధరించని ట్రంప్‌, ఇటీవల ఒక సారి మాస్క్‌ ధరించి అందరిని ఆశ్చర్యపరిచారు. నిపుణులు చెబుతున్నట్లు అవసరమైనప్పుడు మాస్క్ ధరించడం పెద్ద ఇబ్బంది కాదని, కానీ సామాజిక దూరాన్ని పాటించడం కొంత ఇబ్బందేనని తెలిపారు. కాగా ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో, భారీ జనసమూహాలకు అవకాశం ఉందని, అందువల్ల అవసరమైన చోట మాస్క్‌లు ధరించాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజలకు సూచించారు.

(చదవండి: భారతీయులంటే ఇష్టం.. చైనీయులు కూడా: ట్రంప్)‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top