పేలిన ట్రక్కు : ఐదుగురు మృతి | Truck explosion in China kills five, injures 20 | Sakshi
Sakshi News home page

పేలిన ట్రక్కు : ఐదుగురు మృతి

Mar 20 2016 8:41 AM | Updated on Jul 29 2019 5:43 PM

పేలిన ట్రక్కు : ఐదుగురు మృతి - Sakshi

పేలిన ట్రక్కు : ఐదుగురు మృతి

మధ్య చైనా హునాన్ ప్రావిన్స్లో జాతీయ రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న ట్రక్కులో పేలుడు సంభవించింది.

బీజింగ్ : మధ్య చైనా హునాన్ ప్రావిన్స్లో జాతీయ రహదారిపై అధిక వేగంతో వెళ్తున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు.

సదరు ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. అలాగే ఈ పేలుడు ధాటికి రెండు కార్లు, రెండు ట్రక్కులతోపాటు ఏడు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనాయని చెప్పారు. ఈ ఘటనతో రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.  పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ ను పునరుద్దరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement