వైరల్‌ వీడియో: ‘ఐ లవ్‌ యూ బేబీస్‌’

Sweet Moment Mama Parrot tells Chicks I Love You Babies - Sakshi

వాషింగ్టన్‌, అమెరికా : తల్లి, పిల్లల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మనుషులకే కాదు సృష్టిలోని జీవులన్నింటిలోనూ ఉంటాయి. అమెరికాలో సోమవారం జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి చాటి చెప్పింది. పక్షి ప్రేమికురాలు హాగ్‌కు తాను పెంచుకుంటున్న మాటల చిలుక పిల్లలతో ఆడుకోవడం మహా సరదా.

ఎప్పటిలానే సోమవారం చిలుక పిల్లలతో ఆట మొదలుపెట్టిన హాగ్‌ ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది. పొడిపొడి మాటలను మాత్రమే పలికే హాగ్‌ చిలుక పిల్లలకు ‘ఐ లవ్‌ యూ బేబీస్‌’ అని చెప్పింది. పిల్లల నోటికి ఆహారాన్ని అందిస్తూ తల్లి చిలుక వాటిని ముద్దాడుతున్న ఈ అరుదైన సన్నివేశాల్ని హాగ్‌ రహస్యంగా కెమెరాలో బంధించింది. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌ అయింది. దాదాపు లక్షా ముప్పైవేల మంది ఆ పక్షుల ప్రేమానురాగాల్ని చూసి మురిసిపోయారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top