పెద్దయ్యాకా ఐస్‌క్రీమ్ ఎందుకు వద్దనమంటే... | study says elders dont quite ice cream because of adds | Sakshi
Sakshi News home page

పెద్దయ్యాకా ఐస్‌క్రీమ్ ఎందుకు వద్దనమంటే...

Apr 23 2016 11:00 AM | Updated on Sep 5 2018 2:14 PM

పెద్దయ్యాకా ఐస్‌క్రీమ్ ఎందుకు వద్దనమంటే... - Sakshi

పెద్దయ్యాకా ఐస్‌క్రీమ్ ఎందుకు వద్దనమంటే...

ఐస్‌క్రీమంటే కేవలం చిన్నపిల్లలు మాత్రమే ఇష్టపడతారా? అదేంలేదు... పెద్దోళ్లు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.

న్యూయార్క్: ఐస్‌క్రీమంటే కేవలం చిన్నపిల్లలు మాత్రమే ఇష్టపడతారా? అదేంలేదు... పెద్దోళ్లు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. దీనికి కారణమేంటి? అనే విషయమై జరిగిన అధ్యయనంలో ...అంతా ప్రచారం ప్రభావమేనని తేలింది. ‘సాధారణంగా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో రకరకాల ఆహారపదార్థాలవైపు మనిషి మళ్లుతుంటాడు.

ఈ సమయంలో పత్రికలు, టీవీలు, ఇతర మీడియాలో వచ్చే ఆహార పదార్థాలపై మక్కువ పెంచుకుంటాడు. ఈ ప్రకటనల్లో మొదటిస్థానం ఐస్‌క్రీమ్‌దే. ఇవి పిల్లలతోపాటు యువతనూ అమితంగా ఆకర్షించేలా ఉంటాయి. దీంతో మనసులో ఐస్‌క్రీమ్ బలంగా నాటుకుంటుంది. అందుకే పెద్దయ్యాక కూడా అతను  అలవాటును ఎప్పటికీ మానుకోలేకపోతాడ’ని పరిశోధకులు తేల్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement