ఎరక్కపోయి.. ఇరుక్కుని!

story of a thief - Sakshi

అలెగ్జాండర్‌ జెఫర్‌సన్‌ డెల్గాడో.. ఓ అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికాలోని పెరూకు చెందిన 28 ఏళ్ల అలెగ్జాండర్‌ పేరుమోసిన దొంగ కూడా. కాస్త తెలివిగలవాడే. ఇంతకీ ఇతడు ఏం చేశాడంటే. పోలీసుల కళ్లు కప్పి జైలు నుంచి పారిపోయాడు. పైగా అతడు ఉన్న జైలు అలాంటిలాంటి జైలు కాదు.. పెరూలో చాలా కట్టుదిట్టమైన జైలు. మరెలా తప్పించుకున్నాడో తెలుసా.. అలెగ్జాండర్‌ సోదరుడు గియాన్‌కార్లో ఇద్దరూ కవలలు.

ఓ రోజు అలెగ్జాండర్‌తో ములాఖత్‌ అయ్యేందుకు గియాన్‌కార్లో జైలుకు వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అలెగ్జాండర్‌ సెల్‌లోకి ఇద్దరూ వెళ్లారు. అక్కడ ఉన్న మరో ఖైదీ గియాన్‌కార్లోకు ఏదో ద్రవాలు ఇవ్వడంతో కళ్లు తిరిగిపడిపోయాడు. వెంటనే అలెగ్జాండర్‌ తన సోదరుడి దుస్తులు మార్చుకుని మెల్లగా జారుకున్నాడు. మెలకువ వచ్చిన గియాన్‌కార్లో జైలు అధికారులకు అసలు విషయం చెప్పాడు. అయితే పారిపోయేందుకు అబద్ధం చెబుతున్నాడని, ఏదో కుట్ర పన్నుతున్నాడని వినిపించుకోలేదు.

అయితే చాలాసార్లు ఇదే విషయాన్ని చెప్పడంతో అధికారులు వేలిముద్రలు.. కంటిపాపలను పోల్చి చూడటంతో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీలలో రికార్డయిన దృశ్యాల ద్వారా కూడా ధ్రువీకరించుకున్నారు. లిమాలోని కాల్లలో అనే పట్టణంలో ఇంట్లో ఉండగా.. ఎట్టకేలకు పోలీసులు అలెగ్జాండర్‌ను పట్టుకున్నారు. పాపం సొంత సోదరుడే కదా.. ఓసారి చూసొద్దామనుకున్న గియాన్‌కార్లోకు దిమ్మదిరిగి ఉంటుంది!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top