
ఐక్యరాజ్య సమితి : పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేస్తేనే.. సరిహద్దుల్లో శాంతి ఏర్పడుతుందని భారత్ ఐక్యరాజ్యసమితిలో మరోసారి స్పష్టం చేసింది. ఉపఖండంలోని తాజా ఉగ్రవాద పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత శాశ్వత ప్రతినిధి తన్మయలాల్ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్, భారత్‌లోని ఉగ్రవాద చర్యలకు పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలే కారణమని ఆయన వివరించారు. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్, ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా, వాటి అనుబంధ సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ల తండాలు పాకిస్తాన్‌లో విచ్ఛలవిడిగా ఉన్నాయని ఆయన వివరించారు. వీటికి చరమగీతం పాడితేనే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఆయన ఐక్యరాజ్యసమితికి తెలిపారు.
ఆఫ్గనిస్తాన్ సరిహద్దులోని ఉగ్రవాద తాండాలను నిర్మూలించాలని ఆయన సమితికి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి పెంపొందితేనే.. ఉపఖండంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని ఆయన తెలిపారు.