బిల్లు కట్టకుండా.. 120 మంది.. | Spain: Around 120 diners flee restaurant without paying bill | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టకుండా.. 120 మంది..

Mar 3 2017 10:42 AM | Updated on Sep 5 2017 5:06 AM

బిల్లు కట్టకుండా.. 120 మంది..

బిల్లు కట్టకుండా.. 120 మంది..

ఫంక్షన్‌ పేరుతో ఓ స్పెయిన్‌ రెస్టారెంట్‌ను ఓ గ్రూపు మోసగించి పారిపోయింది.

ఫంక్షన్‌ పేరుతో ఓ స్పెయిన్‌ రెస్టారెంట్‌ను ఓ గ్రూపు మోసగించి పారిపోయింది. బెంబ్రీలోని హోటల్‌ కార్మెన్‌లో బాప్టిజం సమావేశాన్ని నిర్వహించేందుకు రొమేనియన్లకు చెందిన ఓ గ్రూపు రూ.62 వేలను అడ్వాన్సుగా చెల్లించింది. మిగిలిన రూ.1.4 లక్షలను కార్యక్రమం అనంతరం చెల్లిస్తామని హోటల్‌ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 120 మంది రొమేనియన్లు గురువారం హోటల్‌లో ఫంక్షన్‌కు హాజరై తమ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.
 
ఈ సమయంలో 30 బాటిళ్ల మద్యాన్ని సేవించారు. హోటల్‌ సిబ్బంది వారికి భోజన ఏర్పాట్లు చేసేలోపు అందరూ అక్కడి నుంచి ఊడాయించారు. దీంతో హోటల్‌ యజమాని రోడ్రిగేజ్‌ ఘటనపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement