సోమాలియా రాజధాని మొగదిష్ విమానాశ్రయంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది.
మొగదిష్ : సోమాలియా రాజధాని మొగదిష్ విమానాశ్రయంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పేలుడుకు తమదే బాధ్యత అని ఆల్ షెబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతి దాడితో పాటు మరో పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.