సామాజిక మాధ్యమాలతోమానసిక సమస్యలు | Sakshi
Sakshi News home page

సామాజిక మాధ్యమాలతోమానసిక సమస్యలు

Published Mon, Oct 10 2016 2:39 AM

సామాజిక మాధ్యమాలతోమానసిక సమస్యలు - Sakshi

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాలు విరివిగా వాడుతూ యువత మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారనీ, సమస్య ఉన్నట్లు కూడా వారు గుర్తించలేక పోతున్నారని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, మానసిక రోగ నిపుణులు..ఈ జాఢ్యాన్ని వదిలించడానికి చేతులు కలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారని, సంబంధాలను నెర పలేకపోతున్నారని పేర్కొంటున్నారు. కొంత మంది యువత వేధింపులకు గురవుతుండగా, కొందరు బానిసలౌతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement