ఇక తాళంచెవి అవసరం లేదోచ్! | 'Smart' lock won't let thieves steal your bike | Sakshi
Sakshi News home page

ఇక తాళంచెవి అవసరం లేదోచ్!

May 21 2014 2:55 AM | Updated on Sep 2 2017 7:37 AM

ఇక తాళంచెవి అవసరం లేదోచ్!

ఇక తాళంచెవి అవసరం లేదోచ్!

ఇక ముందు మీ బైక్‌కు ఎలాంటి తాళం చెవులూ అవసరం లేదు.. మీరు బైక్ దగ్గరికి వెళ్లగానే దానంతట అదే అన్‌లాక్ అయిపోతుంది..

 వాషింగ్టన్: ఇక ముందు మీ బైక్‌కు ఎలాంటి తాళం చెవులూ అవసరం లేదు.. మీరు బైక్ దగ్గరికి వెళ్లగానే దానంతట అదే అన్‌లాక్ అయిపోతుంది.. అంతేకాదు ఎవరైనా మీ బైక్‌ను చోరీ చేయడానికి ప్రయత్నిస్తే మీ స్మార్ట్‌ఫోన్‌కు సందేశం పంపి హెచ్చరిస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురైతే వెంటనే అవసరమైనవారికి సమాచారాన్నీ అందిస్తుంది.. అమెరికాకు చెందిన వెలో లాబ్స్ సంస్థ వ్యవస్థాపకులు జాక్ అల్‌కహ్వతి, గెరార్డో బరోటా రూపొందించిన ‘స్కైలాక్’ ప్రత్యేకతలివి.

బైకుల్లో ఏర్పాటు చేసే ఈ ‘స్కైలాక్’ వ్యవస్థ బ్లూటూత్, వైఫై వంటివాటి ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం అవుతుంది. మీరు దగ్గరికి వెళ్లగానే బైక్‌ను అన్‌లాక్ చేస్తుంది. దీనిలో ఏర్పాటు చేసిన యాక్సిలరోమీటర్ సహాయంతో ప్రమాదం జరిగినప్పుడు గుర్తించి.. వెంటనే హెచ్చరిస్తుంది. అన్నింటికంటే విశేషం ఏమిటంటే ఈ ‘స్కైలాక్’కు ఎలాంటి అదనపు విద్యుత్ అవసరం లేదు. బైక్‌పై ఏర్పాటు చేసే సౌరవిద్యుత్ ఫలకాల ద్వారా దీన్లో ఏర్పాటు చేసే బ్యాటరీని నింపుకొంటుంది. అదీ ఒక గంటపాటు చార్జ్ అయితే.. నెలరోజులు పనిచేస్తుందట. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా..? జస్ట్ రూ. 15 వేలు మాత్రమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement