దారుణం: ఒక ఏనుగును కాపాడటానికి వెళ్లి

Six Elephants Die Trying To Save Each Other In Thailand - Sakshi

థాయ్‌లాండ్‌లోని ఓ వన్యమృగ పార్కులో విషాదం చోటుచేసుకుంది. పార్కులోని సరస్సులో పడి ఆరు ఏనుగులో మృతి చెందాయి. తొలుత ప్రమాదవశాత్తు ఓ చిన్న ఏనుగు పడిపోయింది. దానిని కాపాడే క్రమంలో వెళ్లిన మరో ఏనుగు కూడా సరస్సులో పడిపోయి మృతి చెందింది. ఇలా... ఒకదానికోసం మరోకటి వెళ్లి ఆరు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అక్కడి స్థానికులను తీవ్రంగా కలచివేసింది. మరో రెండు ఏనుగులు సరస్సు అంచున ఉన్నట్లు గుర్తించిన అటవీ అధికారులు వాటిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఇదే సరస్సులో పడి గతంలో కూడా అనేక జంతువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top