
అమ్మా, నాన్నను చూడాలి
ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలిక పేరు యాంగ్. పొద్దున్నే బుద్ధిగా బడికెళ్తుంది.
నెలలు నిండకుండానే కాదు... న్యుమోనియాతో పుట్టింది. దాంతో ఆ పాపకు చికిత్స చేయించే స్తోమత లేదనుకున్నారేమో ఆ దంపతులు ఓ ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి మెంగ్వీ అనే మహిళ యాంగ్‌ను పెంచింది. అయితే కని వదిలేసి వెళ్లిపోయిన అమ్మానాన్నలపై యాంగ్‌కి కోపం లేదు. ఎప్పటికైనా వారి ఒడిలో చేరాలని ఆరాటపడుతోంది. అందుకే ఇలా అన్వేషిస్తోంది. మరి యాంగ్ ప్రయత్నం ఫలించాలని, తల్లిదండ్రుల ఒడికి క్షేమంగా చేరాలని మనమంతా ఆశిద్దాం.