ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు... | Shocking! Elated over winning lottery jackpot, man storms boss's office, urinates on him | Sakshi
Sakshi News home page

ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...

Aug 2 2016 3:33 PM | Updated on Oct 9 2018 5:39 PM

ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు... - Sakshi

ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...

ఉద్యోగికి అనుకోకుండా లాటరీ తగలడంతో చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. బాస్ రూం లోకి వెళ్ళి అక్కడ యూరిన్ పోసి నానా హంగామా చేశాడు.

లండన్ః కొందరికి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేరు. అనుకోని సంఘటన ఏది జరిగినా తట్టుకోలేకపోతారు. ఆ కోవకు చెందిన వ్యక్తి ప్రవర్తనే ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగికి అనుకోకుండా లాటరీ తగలడంతో చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. బాస్ రూం లోకి వెళ్ళి అక్కడ యూరిన్ పోసి నానా హంగామా చేశాడు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఆ షాకింగ్ ఘటన.. ఇప్పుడు వైరల్ గా మారింది.

లండన్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఆకస్మాత్తుగా లాటరీ విన్ అయినట్లు సమాచారం అందింది. అనుకోకుండా అంతటి అదృష్టం వరించేప్పటికి ఆనందం పట్టలేకపోయాడు. హడావిడిలో ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు.  బాస్ రూం లోకి వెళ్ళి యూరిన్ పోసి కలంకలం సృష్టించాడు. జాక్ పాట్ తనను వరించిందని తెలియగానే ముందుగా.. కూర్చున్న కుర్చీలోనే ఎగిరెగిరి గంతులేశాడు. అనంతరం ఒళ్ళు తెలీకుండా ఆఫీసులో ఆటూ ఇటూ పరుగులు తీశాడు. దీంతో పక్కనే ఉన్న కొలీగ్స్ ఖిన్నులైపోయారు. కార్యాలయంలో ఎప్పుడూ తమతోపాటు.. ప్రశాంతంగా పనిచేసుకునే వ్యక్తి ఉన్నట్లుండి వింతగా ప్రవర్తించడంతో కాస్త భయపడ్డారు కూడా.

అయితే అక్కడున్న వారు ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అతడు తిన్నగా బాస్ కేబిన్ లోకి ప్రవేశించాడు. అక్కడున్న పర్సనల్ సెక్రెటరీని భయభ్రాంతులకు గురి చేశాడు. తర్వాత బాస్ పై కూడా తన ప్రతాపం చూపించాడు.  కుర్చీనుంచీ పడియేట్టు కొట్టడమే కాక ఏకంగా అతడిపై యూరిన్ పోసి హల్ చల్ చేసి... చివరికి ఏమీ తెలియనట్లు తన సీట్లోకి వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాకు చిక్కిన ఆ వీడియో ఇప్పుడు య్యూట్యూబ్ లో వైరల్ అయింది. కార్యాలయాల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement