‘నీ శరీరంలో ఎముకలనేవి ఉన్నాయా..!?’ | Shemika Charles Gravity Defying Limbo Video At Philadelphia Airport | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: ‘నీ శరీరంలో ఎముకలనేవి ఉన్నాయా..!?

Sep 6 2018 9:44 AM | Updated on Sep 7 2018 8:22 AM

Shemika Charles Gravity Defying Limbo Video At Philadelphia Airport - Sakshi

విమానాశ్రయంలో లింబో డ్యాన్స్‌ చేసిన షెమీకా చార్లెస్

కానీ ఇదే ప్లేస్‌లో షెమీకా చార్లెస్ ఉంటే ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.

న్యూయార్క్‌ : సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అనుకోని కారణాల వల్ల ప్రయాణం కాస్తా ఆలస్యమయితే ఎక్కడ లేని చిరాకు వస్తుంటోంది. ఆ సమయంలో ఫోన్‌ పట్టుకునో, బుక్‌ చదువుతునో కాలక్షేపం చేయడానికి ప్రయత్నిస్తుంటాము. కానీ కాసేపటికి అది కూడా బోర్‌ కొడుతుంది. ఇక అప్పుడు చేసేదేం లేక ఆలస్యానికి కారణమయిన వారిని తిట్టుకుంటూ కూర్చుంటాము. ఇది మనలాంటి వారి పరిస్థితి. కానీ ఇదే ప్లేస్‌లో షెమీకా చార్లెస్ ఉంటే ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు.

న్యూయార్క్‌ బఫెలోకు చెందిన షెమీకా చార్లెస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లింబో డ్యాన్సర్‌. కొద్ది రోజుల క్రితం ప్రయాణ నిమిత్తం ఆమె ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో వెయిట్‌ చేస్తోంది. కానీ ఆమె ప్రయాణించాల్సిన విమానం కాస్తా ఆలస్యంగా రానున్నట్లు తెలిసింది. దాంతో అందరిలా ఫోన్‌తో కాలక్షేపం చేయకుండా విమానాశ్రయంలోనే లింబో డ్యాన్స్‌ చేసింది. అక్కడ ఉన్న వారు ఆమె చేసిన డ్యాన్స్‌ చేసి ఆశ్చర్యపోయారు. షెమికా భర్త ఆమె చేసిన లింబో డ్యాన్స్‌ని వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్‌ చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది. ‘అసలు మీ ఒంట్లో ఎముకలేమైనా ఉన్నాయా’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. లింబో డ్యాన్స్‌లో ఇప్పటికే షెమికా పేరన ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement