హిల్లరీ గొప్ప అధ్యక్షురాలు కాగలరు: ఒబామా
మళ్లీ పోటీ చేసి గెలిస్తే.. హిల్లరీ క్లింటన్ అమెరికాకు అద్భుతమైన అధ్యక్షురాలు కాగలరని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు.
వాషింగ్టన్: మళ్లీ పోటీ చేసి గెలిస్తే.. హిల్లరీ క్లింటన్ అమెరికాకు అద్భుతమైన అధ్యక్షురాలు కాగలరని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. తామిద్దరూ చాన్నాళ్లుగా స్నేహితులమని, హిల్లరీ అంటే తనకెంతో అభిమానమని ఒబామా తెలిపారు. హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్షుడు జో బెడైన్‌లతో కలసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. 2008 నాటి ప్రైమరీల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఒబామాతో హిల్లరీ క్లింటన్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఒబామా వ్యాఖ్యలు ‘లైవ్ విత్ కెల్లీ అడ్ మైకేల్’ అనే టీవీ కార్యక్రమంలో శుక్రవారం (అమెరికా కాలమానం) ప్రసారం కానున్నాయి.


