breaking news
President of the United States
-
నోబెల్ శాంతికి నేనే బెస్ట్: ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: గతేడాది నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కలేదన్న అక్కసును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెళ్లగక్కారు. అసలు ఆ పురస్కారానికి తనకంటే అర్హుడు చరిత్రలోనే మరెవరూ లేరని చెప్పుకున్నారు. వెనెజువెలా చమురు నిల్వలకు సంబంధించిన ప్రణాళికల గురించి చర్చించేందుకు చమురు, సహజవాయు కంపెనీల ఉన్నతాధికారులతో శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిపిన సమావేశాన్ని ట్రంప్ ఇందుకు వేదికగా మార్చుకోవడం విశేషం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఏమీ చేయకపోయినా నోబెల్ శాంతి పురస్కారం దక్కిందంటూ ఈ సందర్భంగా ఆయన వాపోయారు. ‘‘రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక కేవలం 8 నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 అతి పెద్ద యుద్ధాలను ఆపాను. 36 ఏళ్లు, 32, 31, 28, 25 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాలవి. తద్వారా లక్షలాది మంది ప్రజలు చనిపోకుండా కాపాడా’’అన్నారు. అంతేకాదు, ‘భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం దిశగా వెళ్తున్న భారీ ఘర్షణను కూడా ఆపేశా’నని మరోసారి చెప్పుకున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి లక్షలాదిగా ప్రాణ నష్టాన్ని నివారించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా తనకు కృతజ్ఞతలు కూడా తెలిపారని గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పుకోవడం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. ‘‘అసలు ఒబామాకు నోబెల్ పురస్కారం ఎందుకిచ్చారో ఇప్పటికీ కనీసం ఆయనకు కూడా తెలియదు. నాకు మాత్రం వాస్తవానికి నేను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ శాంతి బహుమతి చొప్పున ఇవ్వాలి’’అని చెప్పుకున్నారు. -
హిల్లరీ గొప్ప అధ్యక్షురాలు కాగలరు: ఒబామా
వాషింగ్టన్: మళ్లీ పోటీ చేసి గెలిస్తే.. హిల్లరీ క్లింటన్ అమెరికాకు అద్భుతమైన అధ్యక్షురాలు కాగలరని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. తామిద్దరూ చాన్నాళ్లుగా స్నేహితులమని, హిల్లరీ అంటే తనకెంతో అభిమానమని ఒబామా తెలిపారు. హిల్లరీ క్లింటన్, ఉపాధ్యక్షుడు జో బెడైన్లతో కలసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. 2008 నాటి ప్రైమరీల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఒబామాతో హిల్లరీ క్లింటన్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఒబామా వ్యాఖ్యలు ‘లైవ్ విత్ కెల్లీ అడ్ మైకేల్’ అనే టీవీ కార్యక్రమంలో శుక్రవారం (అమెరికా కాలమానం) ప్రసారం కానున్నాయి.


