అమెరికా ఆశ్రయం కోరిన 7000 మంది భారతీయులు | Seven Thousand People From India Sought Asylum In US  | Sakshi
Sakshi News home page

అమెరికా ఆశ్రయం కోరిన 7000 మంది భారతీయులు

Jun 20 2018 12:28 PM | Updated on Jun 20 2018 12:47 PM

Seven Thousand People From India Sought Asylum In US  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది 7000 మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోరారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. 2017లో అమెరికాను ఆశ్రయం కోరిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్ల మంది వలసబాట పట్టారని ఐరాస శరణార్ధుల ఏజెన్సీ తన వార్షిక నివేదికలో తెలిపింది. వీరిలో 1.6 కోట్ల మంది కేవలం గత ఏడాదిలోనే వలసలకు లోనయ్యారని పేర్కొంది.

రోజుకు 44,500 మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళుతున్నారని, ప్రతి రెండు సెకన్లకూ ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళుతున్నారని నివేదిక వెల్లడించింది. యుద్ధాలు, హింస, ప్రాసిక్యూషన్‌ల కారణంగా వరుసగా ఐదో ఏడాది 2017లో అత్యధికంగా వలసలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.

కాంగో సంక్షోభం, సూడాన్‌ యుద్ధం, రోహింగ్యా శరణార్ధుల వ్యవహారంతో వలసలు పెరిగాయని విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement