భద్రతామండలి అత్యవసర సమావేశం | Sakshi
Sakshi News home page

భద్రతామండలి అత్యవసర సమావేశం

Published Sat, Oct 8 2016 8:39 AM

భద్రతామండలి అత్యవసర సమావేశం

న్యూయార్క్: సిరియాలో అంశంపై చర్చించేందుకు నేడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం అత్యవసర సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో సిరియాలోని అలెప్పో నగరంలో జరుగుతున్న వైమానిక దాడులను నిలిపివేసే విషయంపై చర్చించనున్నారు. అమెరికా, రష్యా జరుపుతున్న వైమానికదాడుల్లో అలెప్పో తీవ్రంగా ప్రభావితమౌతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
 
ఐక్యరాజ్యసమితి సిరియా ప్రత్యేక రాయబారి స్టఫాన్ డీ మిస్తుర అలెప్పో నగరంలో ఉన్న ఘర్షన వాతావరణాన్ని తొలగించాలని శుక్రవారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలెప్పోలో కేవలం 900 మందిని లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడుల్లో 2,75,000 మంది ప్రభావితమౌతున్నారని.. సిటీని ఈ విధంగా ధ్వంసం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇవాళ్టి సమావేశంలో వైమానిక దాడులను ఆపేయాలనే ముసాయిదా తీర్మాణాన్ని ప్రవేశపెడతారని భావిస్తున్నా.. ఈ ప్రతిపాదనను రష్యా అంగీకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది.
 

Advertisement
Advertisement