స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సహాయంతో భూకంపాలను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాషింగ్టన్: స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సహాయంతో భూకంపాలను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్మార్‌టఫోన్లు, ల్యాప్‌టాప్‌ల్లో ఉపయోగించే యాక్సిలరోమీటర్లు ఇందుకు తోడ్పతాయని చెబుతున్నారు. ఇటలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వల్కనోలొజిక్, జియోఫిజిక్‌స శాస్త్రవేత్తలు ఆంటోనినో డి అలెసాండ్రో, జీసప్ డీయన్నా దీనిపై పరిశోధన చేశారు.
ప్రస్తుతం స్మార్‌ట ఫోన్లలో ఉపయోగిస్తున్న యాక్సిలరోమీటర్ల సహాయంతో 5 పాయింట్ల కన్నా ఎక్కువ స్థాయి భూ ప్రకంపనలను గుర్తించవచ్చని చెప్పారు. ఒక భూకంప సంబంధిత నెట్‌వర్‌క ఏర్పాటు చేసి, స్మార్‌టఫోన్లన్నింటినీ దానికి అనుసంధానిస్తే.. చాలా ప్రయోజనం చేకూరుతుందని వారు పేర్కొన్నారు. స్మార్‌టఫోన్ల నుంచి వచ్చిన డాటా ఆధారంగా భారీ ప్రకంపనలు వచ్చిన, భారీగా నష్టం జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించవచ్చని తెలిపారు.