'ఉగ్ర'వాద దంపతులు కలిసింది అక్కడే! | San Bernardino attackers 'met online' and in person at Hajj | Sakshi
Sakshi News home page

'ఉగ్ర'వాద దంపతులు కలిసింది అక్కడే!

Dec 23 2015 1:17 PM | Updated on Sep 3 2017 2:27 PM

కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారణమైన ఉగ్రవాద దంపతులు మొదట కలిసింది మక్కా యాత్రలో అని విచారణ సందర్భంగా తేలింది.

వాషింగ్టన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారణమైన ఉగ్రవాద దంపతులు మొదట కలిసింది మక్కా యాత్రలో అని విచారణ సందర్భంగా తేలింది. ఆన్లైన్ ద్వారా పరిచయం అయిన ఫరూక్, తష్ఫిన్ మాలిక్లు మక్కాలో కలుసుకున్నారని వారి వీసాల వివరాలను పరిశీలించడం ద్వారా న్యాయవిచారణ కమిటీ గుర్తించింది.

2013లో ఉగ్రవాద దంపతుల కుటుంబాలు సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించాయి. ఈ సందర్భంగానే ఇరుకుటుంబాల మధ్య ఫరూక్, తష్ఫిన్ల పెళ్లి ప్రతిపాదన వచ్చిందని, ఫరూక్ కాలిఫోర్నియాలో ఉద్యోగం పొందిన అనంతరం వీరి వివాహం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement