ఆ కంపు మాట పట్ల ట్రంప్ కు సారీ!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్‌లో డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి చేసిన 'పొట్టి చేతుల' వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినట్టు మార్కో రుబియో వెల్లడించారు.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్‌లో డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి చేసిన 'పొట్టి చేతుల' వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినట్టు మార్కో రుబియో వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి నామినేషన్ రేసు నుంచి తాను తప్పుకోవడం, ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖరారు కావడం నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్‌తో ఇప్పుడు స్నేహంగా, మద్దతుగా మెలగాలనుకుంటున్న ఆయన.. గతంలో చేసిన అథమవ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గతంలోనే ట్రంప్‌కు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పానని, అయితే అప్పట్లో మీడియా ముందు ఆవిషయాన్ని చెప్పలేదని, ఇప్పుడు రేసులో లేకపోవడంతో ఆ విషయాన్ని వెల్లడించానని రూబియో సీఎన్‌ఎన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఫ్లోరిడా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల సందర్భంగా డిబేట్‌లో ఆ రాష్ట్ర సెనేటరైన రుబియో ట్రంప్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. కాస్తా పొట్టిగా ఉండే తననను 'లిటిల్ మార్కో' అని ఎద్దేవా చేసిన 'ట్రంప్ చేతులు చూడండి.. అవి చిన్నవిగా ఉన్నాయి. చేతులు చిన్నవిగా ఉంటే శరీరాంగాలు కూడా చిన్నవిగానే ఉంటాయి' అని రూబియో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. 'ఈ చేతులను చూడండి. ఇవి చిన్నవిగా కనిపిస్తున్నాయా? ఇవి చిన్నవిగా ఉంటే 'ఇంకోటి' కూడా చిన్నదిగా ఉండే అవకాశముంది' అని అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. 'ఇందులో సమస్య ఏమీ లేదు. నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను' అని పేర్కొన్నారు. పురుషాంగం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి.