breaking news
Rubio
-
అందుకే భారత్‌పై సుంకాలు.. చైనా, ఈయూ దేశాలకు మినహాయింపు
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతుందని.. తద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు(25 శాతం పెనాల్టీతో కలిపి) విధించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతూ.. అదే పని చేస్తున్న చైనా, ఈయూల విషయంలో మినహాయింపు దేనికని అమెరికాను నిలదీసింది. దీనికి తోడు చైనా విషయంలో ట్రంప్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే..అమెరికా చైనాను ఎందుకు మినహాయించింది? ఇండియాపై భారీ టారిఫ్‌లు ఎందుకు? అనే ప్రశ్నలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురు కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు జరిపే దేశాలే. ఆ రెండు మాస్కోకు ప్రధాన భాగస్వాములే. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ, భారత్‌తో పోలిస్తే చైనా పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి.... భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభపడుతోంది. అదే రష్యా నుండి చమురు కొనుగొలు చేసి.. దాన్ని శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్‌కు చైనా విక్రయిస్తోంది. ఒకవేళ.. చైనా మీద మీద గనుక అదనపు సుంకాలు విధించాల్సి వస్తే ఆ ప్రభావంతో ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది’’ అని రుబియో వ్యాఖ్యానించారు.చైనాలో శుద్ధి అవుతున్న రష్యా చమురు గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తోంది. ఒకవేళ చైనాపై అదనపు సుంకాలుగానీ, ఆంక్షలుగానీ విధించాల్సి వస్తే.. శుద్ధి చేసిన ఆ చమురు ప్రపంచ మార్కెట్‌కు అందదు. చమురు కొనుగోలు చేసే దేశాలు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. ప్రత్యామ్నాయ వనరులు వెతకాల్సి ఉంటుంది. అంతెందుకు.. చైనా నుంచి శుద్ధి చేయబడిన చమురును యూరప్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో.. యూరప్ దేశాలు స్వయంగానూ చమురు, సహజ వాయువును రష్యా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకు ముందు.. చైనా, అమెరికాపై వంద శాతం సుంకాలు విధించాలనే సెనెట్ బిల్లు ప్రతిపాదనపై యూరోపియన్ దేశాలు పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆ పని చేయడం లేదు అని అన్నారాయన.మరి ఐరోపా దేశాలపై సుంకాలు?మరి రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలపై సుంకాలు విధిస్తారా? అనే ప్రశ్నకు రూబియో బదులిచ్చారు. యూరప్ నేరుగా ఆంక్షలు, సుంకాల విధింపు గురించి నా దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. కానీ, పరోక్షంగా విధించే అవకాశాలు మాత్రం లేకపోలేదని అన్నారాయన. ఈ విషయంలో యూరోపియన్ దేశాలతో టిట్ ఫర్ టాట్ తరహా వాదనలు (tit-for-tat) చేయడం నాకు ఇష్టం లేదు. కానీ, ఈ సమస్యను పరిష్కరించడంలో యూరోప్ నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని మాత్రం నమ్ముతున్నా అని రుబియో అభిప్రాయపడ్డారు. -
ఆ కంపు మాట పట్ల ట్రంప్ కు సారీ!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్లో డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి చేసిన 'పొట్టి చేతుల' వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినట్టు మార్కో రుబియో వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి నామినేషన్ రేసు నుంచి తాను తప్పుకోవడం, ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖరారు కావడం నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్‌తో ఇప్పుడు స్నేహంగా, మద్దతుగా మెలగాలనుకుంటున్న ఆయన.. గతంలో చేసిన అథమవ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గతంలోనే ట్రంప్‌కు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పానని, అయితే అప్పట్లో మీడియా ముందు ఆవిషయాన్ని చెప్పలేదని, ఇప్పుడు రేసులో లేకపోవడంతో ఆ విషయాన్ని వెల్లడించానని రూబియో సీఎన్ఎన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల సందర్భంగా డిబేట్లో ఆ రాష్ట్ర సెనేటరైన రుబియో ట్రంప్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. కాస్తా పొట్టిగా ఉండే తననను 'లిటిల్ మార్కో' అని ఎద్దేవా చేసిన 'ట్రంప్ చేతులు చూడండి.. అవి చిన్నవిగా ఉన్నాయి. చేతులు చిన్నవిగా ఉంటే శరీరాంగాలు కూడా చిన్నవిగానే ఉంటాయి' అని రూబియో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ.. 'ఈ చేతులను చూడండి. ఇవి చిన్నవిగా కనిపిస్తున్నాయా? ఇవి చిన్నవిగా ఉంటే 'ఇంకోటి' కూడా చిన్నదిగా ఉండే అవకాశముంది' అని అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. 'ఇందులో సమస్య ఏమీ లేదు. నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను' అని పేర్కొన్నారు. పురుషాంగం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. -
ట్రంప్ నోటినుంచి మరో కంపు మాట!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం జరుగుతున్న డిబేట్లో చాలా అథమస్థాయి భాష కనిపిస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ డొనాల్డ్ ట్రంప్ ఈ డిబేట్లో ద్వంద్వార్థాలు వచ్చే వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నాడు. తాజాగా ప్రత్యర్థి రుబియోతో జరిగిన సంవాదంలో ట్రంప్ పరోక్షంగా తన పురుషాంగాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు గురవుతున్నది. 'సూపర్ ట్యూస్డే'లో విజయంతో ఊపుమీదున్న బిలియనీర్ ట్రంప్ తన పోటీదారుడైన రిపబ్లికన్ అభ్యర్థి మార్కో రుబియోపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. కాస్తా పొట్టిగా ఉండే ఫ్లోరిడా సెనేటర్ అయిన రుబియోను ఉద్దేశించి 'లిటిల్ మార్కో' అంటూ ట్రంప్ గతంలో పలుసార్లు ఎద్దేవాపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాజా డిబేట్లో రుబియో విమర్శలు చేశాడు. ట్రంప్ చేతులు చూడండి.. అవి చిన్నవిగా ఉన్నాయంటూ విమర్శించాడు. 'ఈ చర్చావేదికపై ట్రంప్ చాలామందిని పరిహాసించాడు. నిజానికి ఆయనే ఈ విమర్శలకు వందశాతం అర్హుడ'ని రూబియో పేర్కొన్నాడు. రూబియో వ్యాఖ్యలను ప్రస్తావించిన ట్రంప్ 'ఈ చేతులను చూడండి. ఇవి చిన్నవిగా కనిపిస్తున్నాయా? ఇవి చిన్నవిగా ఉంటే 'ఇంకోటి' కూడా చిన్నదిగా ఉండే అవకాశముంది' అని ట్రంప్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించాడు. 'ఇందులో సమస్య ఏమీ లేదు. నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను' అని పేర్కొన్నాడు. తన పురుషాంగం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.